టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున మరియు తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . వీరిద్దరి కలయికలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం కుబేర . డబ్బులు నేపథ్యంలో నడిచే ఈ కథను శేఖర్ కమ్ముల రూపొందించాడు . ఆయన డైరెక్షన్లో ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్గా నిలిచింది . మొన్న శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం ను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు . 

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు . ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి కలెక్షన్లు కూడా ఓ రేంజ్ లో వస్తున్నాయి . తాజాగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరింది . కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 100 కోట్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . తాజాగా నాగార్జున మరియు ధనుష్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ ఈ విషయం తెలిపింది . ఈ చిత్రం కథ బాగుండడంతో జనాలు సైతం థియేటర్ కి వెళ్లి చూసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు . ఇక దీనికి తగ్గట్లుగానే ఈ మూవీకి పోటీగా థియేటర్లలో ఏ సినిమా కూడా రాలేదు .

దీంతో ఇది శేఖర్ కమ్ములకు ప్లస్ అయింది . సినిమా కనుక మరో వారం రోజులు ఇలానే కొనసాగితే రెండు కోట్లు దాటడం పక్క అంటున్నారు విశ్లేషకులు . ఇప్పటికే  సెంచరీ టార్గెట్ ఊదేసిన ఈ మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్  రాబట్టి ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి . ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి బానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు . తండేల్ చిత్రంతో నాగచైతన్య హిట్ కొట్టగా ప్రజెంట్ నాగార్జున కుబేరతో దూసుకుపోతున్నాడు . మరి అఖిల్ ఏ విధంగా హిట్ కొట్టనున్నాడో చూడాలి మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: