మన ఇండియన్ సినీ లవర్స్ కొన్ని సంవత్సరాల క్రితం ఓ టి టి కంటెంట్ ను పెద్దగా వీక్షించేవారు కాదు. కానీ ఎప్పుడైతే మన దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి పరిస్థితులు చాలా వరకు మారాయి. కరోనా తీవ్రంగా ఉంచడంతో దేశంలో థియేటర్లను కొంత కాలం పాటు మూసి వేశారు. అలాగే టీవీలో కొత్త కంటెంట్ కూడా రావడం బంద్ అయింది. దానితో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కోసం చాలా మంది జనాలు ఓ టీ టీ లపై ఆధార పడ్డారు. దానితో ఒక్క సారిగా ఇండియాలో ఓ టీ టీ ప్రభావం భారీగా పెరిగిపోయింది. దానితో ఇండియా వ్యాప్తంగా అనేక ఓ టీ టీ లు పుట్టుకొచ్చాయి.

సినిమా నిర్మాతలు కూడా సినిమాకు థియేటర్ , సాటిలైట్ , మ్యూజిక్ , డబ్బింగ్ హక్కులతో పాటు ఓ టీ టీ హక్కుల రూపంలో కూడా భారీ మొత్తంలో డబ్బులు వస్తూ ఉండటంతో నిర్మాతలు కూడా వీటిపై అత్యంత ఆసక్తిని చూపించడం మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు ఓ టీ టీ లు సినిమా నిర్మాతలకు పెద్ద గండంగా మారాయి. అందుకు ప్రధాన కారణం అనేక ఓ టి టి ప్లాట్ ఫామ్ వారు అన్ని సినిమాలను కొనడానికి ముందుకు రావడం లేదు. కొన్ని సెలెక్టివ్ సినిమాలను మాత్రమే కొంటున్నారు. అలాగే ఒక సినిమా ఎప్పుడు విడుదల కావాలి అనే దాన్ని కూడా వారే డిసైడ్ చేస్తున్నారు. దానితో సినిమా మొత్తం పూర్తి అయిన కూడా ఓ టీ టీ వారు ఇచ్చిన డేట్ కే మూవీ ని విడుదల చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని కూడా అనేక మంది నిర్మాతలు చెబుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఓ టి టి దిల్ కూడా ఇప్పటివరకు ఫైనల్ కాలేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

కానీ హరిహర వీరమల్లు మూవీ యూనిట్ మాత్రం ఓ టి టి డీల్  తో సంబంధం లేకుండా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ ని జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీనితో చాలా మంది ప్రేక్షకులు హరిహర వీరమల్లు మూవీ యూనిట్ లాగానే అందరూ స్టార్ హీరోలు ఓ టి టి లను పట్టించుకోకుండా విడుదల తేదీలను ప్రకటిస్తే ఓ టి టి వారే కిందికి దిగి వస్తారు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: