సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు విడాకులు తీసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ వస్తుంది. చాలా సంవత్సరాల క్రితం సినీ పరిశ్రమకు సంబంధించిన వారి విడాకులు చాలా తక్కువ శాతం జరుగుతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వాటి సంఖ్య కాస్త ఎక్కువగా పెరిగిపోయింది. ఇకపోతే సినీ నటుడు రఫీ , మహిన మున్నా తాజాగా విడిపోయారు. రఫీ కొంతకాలం క్రితం చక్కపాలెం అనే సీరియల్లో నటించాడు. ఆ సీరియల్ ద్వారా ఆయన మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత ఈయనకు మంచి అవకాశాలు దక్కాయి. రఫీ కొంత కాలం క్రితం కనీ మంగళం కోవిలగం అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ ద్వారా రఫీ కి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈయన సుమతి వలపు అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కనుక మంచి విజయం సాధిస్తే ఈయనకు మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. తాజాగా మహిన మున్నా , రఫీ తో విడాకుల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. మహిన తాజాగా మాట్లాడుతూ ... నేను రఫీ తో విడాకులు తీసుకున్నాను. కానీ అందుకు గల కారణాలను నేను చెప్పాలి అనుకోవడం లేదు. మేము ఇద్దరం విడిపోయాం. అందుకు గల కారణాలను ఎందుకు ..? ఏమిటి ..? అని ఎవరిని అడగకండి. మా గురించి పేరెంట్స్ , బంధువులు , స్నేహితులను అడిగి వారిని కూడా అస్సలు ఇబ్బంది పెట్టకండి అని ఈమె కోరింది. ఇకపోతే గత కొంత కాలంగా మహిన దుబాయ్ లో  ఉంటుంది. దాని గురించి కూడా ఈమె స్పందించింది. నా జీవితంలో ఎప్పుడూ ఏం జరిగింది అనేది నేను చెప్పాలి అనుకోవడం లేదు. మీరు అడగడం కూడా అసలు కరెక్ట్ కాదు. అది నా వ్యక్తిగత విషయం.

దుబాయ్ కి వెళ్ళాకే నేను మారిపోయాను. రఫీని దూరం పెట్టాను అని కొంత మంది చెత్త కామెంట్స్ చేస్తున్నారు. అది నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. దుబాయ్ కి వెళ్తున్న అమ్మాయిలు అందరూ చెడ్డవారా ..? నేను నా కెరియర్ కోసం మాత్రమే అక్కడికి వెళ్లాను. నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకున్నాను. అలాగే నా పేరెంట్స్ ను నేను బాగా చూసుకోవాలి అనుకున్నాను. అందుకే దుబాయ్ కి వెళ్లాను. దుబాయ్ కి రాగానే అమ్మాయిలు మారిపోతారు .. చెడిపోతారు అనే మాటల్లో ఏ మాత్రం నిజం లేదు అని ఈమె చెప్పుకొచ్చింది. ఇలా రఫీతో విడాకుల గురించి మహిన తాజాగా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: