
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరో తీసుకొని రేమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.జననాయగన్ చిత్రానికి ఏకంగా రూ. 275 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.. KVN ప్రొడక్షన్ వారు లాభాలలో ఎలాంటి భాగస్వామ్యం హీరోకు లేకుండానే పూర్తిగా ఈ రెమ్యూనరేషన్ ని విజయ్ కి చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది.. ఇంత పెద్ద మొత్తంలో ఒక సినిమాకి ఖర్చు పెట్టి మరి హీరోకి అంత చెల్లించడం అన్నది సౌత్ ఇండస్ట్రీ ఫిలిమ్ లోనే ఒక సరికొత్త రికార్డు అన్నట్లుగా కనిపిస్తోంది.
ఇప్పటివరకు సౌత్ స్టార్లలో ఎవరూ కూడా ఇంతటి రెమ్యూనరేషన్ అందుకున్న సందర్భాలు కూడా కనిపించడం లేదు.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం 300 కోట్ల రూపాయలు అందుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు విజయ్ 275 కోట్లు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారుతున్నది. జననాయగన్ చిత్రం కూడా భారీ బడ్జెట్లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రమే హీరో విజయ్ రాజకీయంగా కూడా చాలా కీలకంగా ఉంటుందనే విధంగా అభిమానులు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. మమత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి తదితర నటినట్లు ఇందులో నటిస్తూ ఉన్నారు.