తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన యువ నటులలో నవీన్ పోలిశెట్టి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ లో హీరోగా నటించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన జాతి రత్నాలు అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.

ఇకపోతే ఈయన ఆఖరుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నవీన్ చాలా కాలం క్రితం అనగనగా ఒక రాజు అనే సినిమాను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో మొదట శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే డిలే అవుతూ వెళ్లడంతో ఈ మూవీ నుండి శ్రీ లీల తప్పుకుంది. దానితో మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం అఖిల్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం అఖిల్ హీరోగా లేనిన్ మూవీ స్టార్ట్ అయింది. 

ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ ఈమె ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీలో హీరోయిన్ పాత్రలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి భాగ్య శ్రీ సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో శ్రీ లీల నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఆమెను మార్చి కొత్త హీరోయిన్ ని పెట్టుకోవడంతో ఈ సినిమాతో అఖిల్ మంచి విజయాన్ని అందుకుంటాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: