ఫోన్ ట్యాపింగ్ కేస్ ఇష్యూ తెలంగాణ వ్యాప్తంగా ఎంత పెద్ద దుమారం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబి ప్రభాకర్ రావుని చేర్చారు.అయితే ఈయన ఈ కేసు నుండి తప్పించుకోవడానికి అమెరికా పారిపోయినప్పటికీ మళ్లీ ఇండియాకి తిరిగి వచ్చేలా చేశారు. ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఫోన్ ట్యాపింగ్ గురించి చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి.ఇంకా ఇందులో ఎవరెవరు ఉన్నారు అని బయటికి లాగుతున్నారు.ఇప్పటికే చాలామంది ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రతిపక్షాల ఫోన్ కాల్ డేటాలతో పాటు సినీ సెలబ్రిటీలు,ఇతర ప్రముఖులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు బయటపడ్డాయి. 

ఆ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్ల ఫోన్లు టాప్ అయినట్టు వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ప్రతిపక్షాల కదలికలు ఎలా ఉండబోతున్నాయి.. వారి ఆర్థిక లావాదేవాలు ఏంటి అని..వారికి పర్సనల్ సీక్రెట్స్ ఏమున్నాయి అని తెలుసుకోవడానికి ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించిందనే వార్తలు వినిపించిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ల ఫోన్ కాల్ డేటా ద్వారా వారి పర్సనల్ విషయాలు ఏదైనా ఉంటే బయటపెట్టించడం వారి రాజకీయ కదలికలు ఆర్థిక లావాదేవీలు తెలుసుకోవడం వంటివి చేశారు. ఇప్పటికే ఇందులో ఎంతో మందిని కీలకంగా చేర్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ యాంకర్ అనసూయ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు మీడియాలో ఓ వార్త వినిపిస్తోంది..

 జబర్దస్త్ ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేయడమే కాకుండా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అలా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన అనసూయ రంగస్థలం, విమానం వంటి సినిమాల్లో కూడా కీరోల్ పోషించింది. అయితే అలాంటి అనసూయ కి సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిందని, ఆమె సీక్రెట్స్ ఏమైనా ఉంటే బట్టబయలు చేయడం కోసం ఆమె ఫోన్ ట్యాప్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనసూయ తో పాటు పవిత్ర లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: