
రామాయణం పార్ట్ 1 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. బాలీవుడ్ లో ఈ సినిమానే సాయి పల్లవి డెబ్యూ అవుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా `ఏక్ దిన్` మూవీ ముందుకు వచ్చింది. అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రమిది. అమీర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
అయితే జునైద్ ఖాన్ కు హీరోగా ఇది మూడో చిత్రం. అతని గత రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. అందువల్ల ఏక్ దిన్ పై కూడా బాలీవుడ్‌లో అంచనాలేమి లేవు. ఇప్పుడు ఈ సినిమానే బాలీవుడ్ లో సాయి పల్లివి డెబ్యూ కాబోతుండటంతో ఆమె ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్ అయింది. కొందరైతే `ఏక్ దిన్`కు సైన్ చేసి సాయి పల్లవి రాంగ్ స్టెప్ వేసిందని కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ హీరో ఇమేజ్ కన్నా కథ, పాత్రలను నమ్మి సినిమాను ఓకే చేసే అరుదైన నటి సాయి పల్లవి. అటువంటి ఆమె ఏక్ దిన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఫలితంపై ఆమె ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఏక్ దిన్ సాయి పల్లివికి ఎటువంటి రిజల్డ్ ను అందిస్తుందో చూడాలి.