సినీ తారలు తమ గ్లామర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందాన్ని పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వారు ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో శ్రద్ధా దాస్ కూడా చేరిందని సోషల్ మీడియాలో నెటిజ‌న్లు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఆమె లేటెస్ట్ ఫోటోలే.
ముంబై కి చెందిన శ్రద్ధా దాస్.. `సిద్దు ఫ్రమ్ సీకాకుళం` మూవీతో వెండితెరపై అడిగి పెట్టింది. తొలి చిత్రంతోనే తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుని వరుస అవకాశాలను అందుపుచ్చుకుంది. అయితే శ్రద్ధా దాస్ కు అవకాశాలు వచ్చిన అదృష్టం కలిసి రాలేదు.
స్క్రిప్ట్ సెలక్షన్ లో చేసిన తప్పుల వల్ల ఆమెకు సరైన హిట్స్ పడలేదు. దాంతో దర్శక నిర్మాతలు శ్రద్ధా దాస్ ను సైడ్ క్యారెక్టర్లకు పరిమితం చేసేశారు. కోవిడ్ తర్వాత శ్రద్ధా కెరీర్ మరింత డౌన్ అయింది. అడపా దడపా చిత్రాలతో అతి కష్టం మీద కెరీర్ ను నెట్టుకొస్తుంది.
సినిమాల సంగతేమో గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి వేరే లెవెల్ లో ఫాలోయింగ్ ఉంది. అమ్మడి అందాలకు కుర్రాళ్ళు  అల్లాడిపోతుంటారు. తాజాగా శ్రద్ధా బ్లాక్ అండ్ వైట్ శారీలో సూపర్ హాట్ గా తయారై ఫోటోలకు ఫోజులిచ్చింది. నడుము అందాలను హైలైట్ చేస్తూ మ‌తులు పోగొట్టింది.
అయితే ఈ ఫోటోల్లో శ్రద్ధా దాస్ ముఖంలో మార్పును గ‌మ‌నించి షాక్ అవుతున్నారు నెటిజ‌న్లు. ముఖ్యంగా ఆమె పెదవులు, ముక్కు, గడ్డం దగ్గర తేడాలున్నట్టు చెబుతున్నారు. గత ఫోటోల‌తో పోల్చి చూసినప్పుడు శ్రద్ధ ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉండొచ్చని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇక కొందరు అది మేక‌ప్ మాయాజాలమ‌ని కూడా అంటున్నారు. ఏదేమైనా శ్రద్ధా లేటెస్ట్ ఫోటోలు మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: