చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం హాట్ టాపిక్ గా మారుతుంది .. గతంలో కూడా చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడకం బయటపడింది పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా చేశారు .. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరోసారి ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఓ నటుడు అరెస్టు అయ్యారు .. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ సినిమాల్లో నటిస్తున్న ఒక ఫేమస్ నటుడు డ్రగ్స్ తో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుపడ్డాడు .. ఇక ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్న ఆ హీరోను తమిళనాడు నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీం తమ అదుపులోకి తీసుకున్నారు .. ఆ న‌టుడు మరెవరో కాదు హీరో శ్రీరామ్ ..


ఏఐడీఎంకే మాజీ నేత నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి .. అదేవిధంగా డ్రగ్స్ పెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శ్రీరామ్‌ను విచారిస్తున్నారు .. అయితే ఈ విచారణలో భాగంగా మరికొందరు కోలీవుడ్ నటుల పేర్లు కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరో కోలీవుడ్ నటుడు  కృష్ణ పై కూడా ఆరోపణలు వచ్చాయి .. అలాగే కృష్ణ కూడా డ్రగ్స్ వాడినట్లు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని విచారించాలని నిర్ణయం తీసుకున్నారు ..


అయితే హీరో శ్రీరామ్ అరెస్టు అయిన వెంటనే కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అతని కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు .. ఇక ఇప్పుడు ఎట్టకేలకు కృష్ణ పోలీసులకు దొరికాడు .. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నటుడు శ్రీరామ్‌ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న‌టుడు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేయడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ..  అలా జూన్ 25 అనగా నిన్న పోలీసులు కృష్ణను అరెస్ట్ చేసి రాత్రంతా విచారించారు .. ప్రస్తుతం తమిళనాడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు కృష్ణ .. ఇక మరి కోలీవుడ్ లో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎలాంటి  రచ్చకు దారితీస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: