ఏదైనా విషయాన్ని స్టార్ హీరోలు .. హీరోయిన్లు.. డైరెక్టర్లు మర్చిపోతారేమో కానీ అభిమానులు సోషల్ మీడియాలో వాళ్ళను ఫాలో అయ్యే వాళ్లు మాత్రం అస్సలు మర్చిపోలేరు. అది కూడా స్టార్ సెలబ్రెటీకి సంబంధించిన విషయాన్ని అయితే ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా దాన్ని అలానే గుర్తుపెట్టుకుని ఉంటారు . టైం చూసి ఆ విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు . ప్రజెంట్ సోషల్ మీడియాలో అదే విధంగా సమంతను - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును టార్గెట్ చేసి మరి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు . దీన్నంతటికి కారణం అలియా భట్ నటించిన "జీగ్రా".


"జిగ్రా"  సినిమా తెలుగు ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ స్టేజిపైనే సమంత తో మాట్లాడిన మాటలు అదేవిధంగా సమంత ఇచ్చిన ఆన్సర్ కచ్చితంగా ఏ సమంతా అభిమాని ఆ రోజున మర్చిపోలేరు . దానికి కారణం సమంత ఇచ్చిన ఆన్సర్. జిగ్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ - సమంత అటెండ్ అయ్యారు. ఇదే మూమెంట్లో స్టేజి పైకి వచ్చిన త్రివిక్రమ్ - సమంత గురించి మాట్లాడుతూ "మీకోసం చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు.. మీరు ఇక్కడ కూడా సినిమాలు చేయాలి అనే విధంగా మాట్లాడుతాడు.  దానికి సమంత  ఎవరైనా కధ రాస్తే సినిమా ఛాన్స్ ఇస్తే చేస్తాను అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తుంది.  వెంటనే సమంతకి రిప్లై ఇస్తూ మీరు నటిస్తానంటే నేను రాస్తా అన్నట్లుగా మాటల కాన్వర్జేషన్ ని ముందుకు తీసుకెళ్లాడు త్రివిక్రమ్".


అంతే ఆ తర్వాత ఆ మాటలు మాటలు గానే మిగిలిపోయాయి.  త్రివిక్రమ్ అనుకుంటే ఎంత సేపు..?  సమంత ని హీరోయిన్ గా పెడుతూ ఏదైనా స్టోరీ రాసి ఆరు నెలలో సినిమా తీసి హిట్ కొట్టేయచ్చు..కానీ అలా చేయలేదు అంటూ జనాలు ఇప్పుడు ఇదే విషయాన్ని హైలెట్ చేస్తున్నారు . నిజానికి సమంత హీరోయిన్గా త్రివిక్రమ్ తీసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ , సన్ ఆఫ్ సత్యమూర్తి , అ ఆ ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


మరీ ముఖ్యంగా "అత్తారింటికి దారేది". ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ వేరే లెవెల్ . త్రివిక్రమ్ అనుకుంటే ఏదైనా చేయగలడు . మరి అలాంటి త్రివిక్రమ్ సమంత కోసం ఒక లేడీ ఓరియంటెడ్ కధ రాసుకోలేడా..? అని ప్రశ్నించే సమంతా అభిమానులు కూడా ఉన్నారు. మరికొందరు ఇప్పుడు ఎన్టీఆర్ తో అనుకుంటున్నా సినిమాలో సమంత కి ఛాన్స్ ఇవ్వచ్చుగా అని కూడా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది గురూజీ ఎప్పుడో ఆ మాటను గాలికి వదిలేసాడు మాటను మరిచిపోయాడు అంటూ నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు . చూడాలి మరి సమంత కోసం గురూజి కధ రాసుకుంటాడా..? రాసుకుంటే గురూజీ ఛాన్స్ ఇస్తే సమంత తెలుగు సినిమాను ఓకే చేస్తుందా..? ఇప్పుడు సమంత తెలుగు సినిమాలను ఓకే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది . అంతా బాలీవుడ్ వైపే ఆమె కాన్సెప్ట్రేషన్ చేస్తుంది అంటూ కొంతమంది మేకర్స్ గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. దీనికి కాలమే సమాధం చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: