
ముందుగా మా కథకు తమ్ముడు సినిమా సరైన టైటిల్ అన్నది సినిమాను చూసిన ప్రేక్షకులే ఆ మాటను చెబుతారని నితిన్ నటన కూడా చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుందని తెలిపింది. ఇందులో చాలా కష్టమైన సన్నివేశాలను కూడా చాలా సులభంగానే చేశాను అంటూ వెల్లడించింది లయ. డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఇందులో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా జూలై 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
పెళ్లి అయిన తర్వాత లయ అమెరికాలోని స్థిరపడింది.. 2023 లో ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చినప్పుడు తనకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో మాట్లాడానని.. వాటిని చూసే తమ్ముడు సినిమా టీమ్ తనని అప్రోచ్ అయ్యి జూన్లో తనకి ఫోన్ చేశారు.. నటిస్తారా అని అడిగితే ఓకే అని చెప్పానని తెలిపింది లయ. ఈ సినిమాలో ఝాన్సీ కిరణ్మయి అనే పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పడంతో సుమారుగా ఏడు కిలోల బరువు పెరగడానికి ఎక్కువగా తినే దాన్ని అంటూ తెలిపింది.
తమ్ముడు సినిమా కోసం హైదరాబాదుకి వచ్చే సమయంలోనే అమెరికాలో చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానని.. అవకాశాలు మనం కోరుకున్నప్పుడు రావు అవి కోరుకున్నప్పుడే వస్తాయని ఈ చిత్రంలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చాలా భిన్నంగా ఉంటుందని తెలిపింది లయ. కథకి ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటించాను.. తాను అమెరికా నటిని కాదు పక్క హైదరాబాదు నటినే అంటూ వెల్లడించింది యూఎస్ఏ లో తనకు ఒక ఇల్లు కూడా ఉంది .. అలాగే హైదరాబాదులో కూడా ఉన్నది.. తనకోసం ఎలాంటి బిజినెస్ క్లాస్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, స్టార్ హోటల్స్ వంటి వసతి చేయాల్సిన అవసరం లేదు. సినిమా షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాదులోని నా ఇంట్లోనే ఉంటానని తెలిపింది.