
చాలా కాలం తర్వాత అఖిల్ తన తదుపరి చిత్రం లేనిన్ అనే సినిమానీ ప్రకటించారు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయిందని శ్రీలీల బర్తడే రోజున పోస్టర్లను కూడా అనౌన్స్ చేశారు.తాజాగా ఇటీవలే శ్రీలీల వైదొలిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడం చేత డేట్లు ఖాళీగా లేకపోవడంతో సినిమాని వదిలేసిందని సమాచారం.. ఇందులో కూడా భాగ్యశ్రీ బోర్సే నే తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వీటితోపాటు రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకాతో పాటు దుల్కర్ సల్మాన్ తో కూడా మరొక సినిమాలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఇవే కాకుండా ప్రభాస్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మను అప్రోచ్ చేశరనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం ప్రభాస్ తో నటించే అవకాశం అందుకుంటుంది.. ఇప్పటికే తన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.. దీన్ని బట్టి చూస్తూ ఉంటే వచ్చిన అవకాశాన్నల్లా ఈ ముద్దుగుమ్మ తన అందంతోనే సంపాదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఒక్క హిట్టుతో తన ఫేట్ ను మార్చుకుంటుందేమో చూడాలి భాగ్యశ్రీ