
దీంతో ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. అలాంటి వాళ్ళకి ఇచ్చి పడేస్తున్నారు. వినడానికి ఇది ఒక పెద్ద జోక్ . కన్నప్ప సినిమా బాగుంది . అయితే కుబేర సినిమాని మించిపోయే రికార్డ్స్ కలెక్ట్ చేస్తుంది అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు . మరీ ముఖ్యంగా కన్నప్ప - కుబేర రికార్డును బద్దలు కొడుతుంది అన్న మాటలు పై ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు . అది జరగని పని . కన్నప్ప సినిమా బాగుంది అని టాక్ వచ్చింది తప్పిస్తే కలెక్షన్స్ పరంగా ఎక్కడ బీభత్సంగా లేదు.
అసలు కుబేర కి కన్నప్ప కి పోలికే లేదు . కన్నప్ప ఎప్పుడు కుబేర కి పోటీ కాదు అంటూ ఘాటుఘాటుగా రియాక్ట్ అవుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో కన్నప్ప వీడియోస్ వైరల్ గా మారాయి. కాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే కుబేర సినిమాలో హీరోగా ధనుష్ నటించాడు. రష్మిక హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు . ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకునింది . ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా థియేటర్స్ లో రన్ అవుతుంది . కాగా కుబేర రిలీజ్ అయిన కరెక్ట్ గా ఏడు రోజులకి కన్నప్ప రిలీజ్ కావడం కుబేర రికార్డ్స్ దెబ్బ పడుతుంది అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్న మూమెంట్లో ధనుష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ అంత సీన్ లేదు అని ఘాటుగా తిప్పి కొడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్ వైరల్ గా మారింది..!!