
ప్రెసెంట్ మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యి ఊహించని విధంగా మంచి టాక్ తెచ్చుకున్న భారీ సినిమా కన్నప్ప . మంచు విష్ణు హీరో గా మహాభారతం డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది . అలాగే మేకర్స్ పెట్టుకున్న నమ్మకాన్ని తగ్గట్టు గానే 1 న్ నుంచి ఊహించని రెస్పాన్స్ ని అలాగే బుకింగ్స్ ని కూడా అందుకుంటున్న కన్నప్ప కొన్ని విషయాల్లో మాత్రం పలు విమర్శలకి అనుకొని ప్రశ్నలకి మాత్రం గట్టి చెక్ పెట్టింది ..
ప్రధానంగా హీరో మంచు విష్ణు అయితే తనని ట్రోల్ చేసే వారికి ఈ సినిమాలో తన నటన తోనే మంచి సమాధానం ఇచ్చాడని కూడా చెప్పవచ్చు . ప్రధానంగా కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ లో తన సింగిల్ టేక్ డైలాగ్ , అలాగే శివునికి తన నేత్రాలని అర్పించే మొత్తం ఎమోషనల్ ఎపిసోడ్ తో గాని ట్రోలర్స్ కి సైతం నోటి నుంచి ఎలాంటి మాట రాకుండా చేయడం అనేది మంచు విష్ణుకే దక్కింది . అలాగే తన కెరియర్ లోనే ఇది ది బెస్ట్ పర్ఫామెన్స్ అని కూడా చెప్పవచ్చు .. ఇలా కన్నప్ప తో మాత్రం మంచు విష్ణు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు అందుకోవటం ఇక్కడ మరో విశేషం .. ఇక మరి కలెక్షన్ల పరంగా కన్నప్ప బాక్సాఫీ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..