
ఇప్పటివరకు ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రయాణం చేయడం, అలాగే ఒకే లొకేషన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేయడం వంటివి జరుగుతూ ఉండేది. కానీ తాజాగా నిన్నటి రోజున రష్మిక నటిస్తున్న మైసా అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రష్మిక ఈ పోస్టర్లో చాలా సర్ప్రైజ్ గా అభిమానులకు ఆశ్చర్యపరిచేలా కనిపించింది. చాలామంది రష్మిక పోస్టర్ ను చూసి విభిన్నంగా స్పందించారు. మైసా పోస్టర్ కి విజయ్ దేవరకొండ కూడా స్పందిస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఆ పోస్టర్ని షేర్ చేసి ఇది అద్భుతంగా ఉండబోతోంది అంటూ కామెంట్స్ చేశారు.
విజయ్ దేవరకొండ కామెంట్స్ కి రష్మిక ఇలా స్పందిస్తూ తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా ప్రత్యేకించి మరి శుభాకాంక్షలు అంటూ స్పందించింది.. కానీ విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్ కి విజ్జు.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా నేను చేస్తానంటూ ఒక పోస్ట్ ని సైతం షేర్ చేసింది. ఈ కామెంట్స్ తో రష్మిక,విజయ్ దేవరకొండ మధ్య ఉన్న ప్రేమ బంధం మరొకసారి రివీల్ చేసినట్లుగా కనిపిస్తోందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక హీరోని విజ్జు అని పిలవడం జరగదు.. ఇద్దరి మధ్య స్నేహానికి మించి చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే తమ మధ్య బంధాన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.