మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన బలుపు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో అంజలి , శృతిహాసన్ హీరోయిన్లుగా నటించగా ... తమన్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. ఈ సినిమా కంటే ముందు రవితేజ అనేక అపాజయలతో డీల పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయంలో బలుపు సినిమాతో రవితేజకు అద్భుతమైన విజయం దక్కింది. బలుపు సినిమా 2013 వ సంవత్సరం జూన్ 28 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయ్యి ఈ రోజుతో 12 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆ సమయంలో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది ..? ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 9.10 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడేట్ లో 4.40 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.55 కోట్లు , ఈస్ట్ లో 1.73 కోట్లు , వెస్ట్ లో 1.35 కోట్లు , గుంటూరు లో 1.95 కోట్లు , కృష్ణ లో 1.39 కోట్లు , నెల్లూరు లో 98 లక్షల కలెక్షన్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ఈ సినకి 23.45 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి 5.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 28.75 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 14.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 28.75 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి 14.48 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ సినిమా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt