తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా అద్భుతమైన రీతిలో కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన మొదటగా డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా అనేక ఎత్తు పల్లాలని చూసిన ఈయన డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ను అందుకున్నాక నిర్మాతగా కెరియర్ను టర్న్ తీసుకున్నాడు. అందులో భాగంగా దిల్ సినిమాతో నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన ఈయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈయన నిర్మించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈయన కెరియర్ ప్రారంభంలో నిర్మించిన చాలా సినిమాలను తక్కువ బడ్జెట్ తో రూపొందించడం , అనేక మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంతో దిల్ రాజు కు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే దిల్ రాజు కెరియర్ ప్రారంభంలో అందుకున్న స్థాయి విజయాలను ఇప్పుడు అందుకోవడం లేదు. ఆ విషయాన్ని ఆయన కూడా పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే దిల్ రాజు ఇంత కాలం పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు. ఇక దిల్ రాజు మరో కొత్త బ్యానర్ ను లాంచ్ చేయబోతున్నాడు. దిల్ రాజు డ్రీమ్స్ అనే పేరుతో ఈయన ఒక నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ నిర్మాణ సంస్థను ఈ రోజు సాయంత్రం అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈయన దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో స్థాపించనున్న బ్యానర్ లో ఎలాంటి సినిమాలను నిర్మిస్తాడు ..? దానితో ఏ స్థాయి విజయాలను అందుకుంటాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: