
పాజిటివ్ రివ్యూ లు వినిపించాయి. మొత్తానికి మంచి హిట్ మంచు విష్ణు ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ - అక్షయ్ కుమార్ - మోహన్లాల్ - మోహన్ బాబు- కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించి మెప్పించారు . ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ తన గ్లామర్ తో సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది . తన గ్లామర్ టచ్ సినిమాకి బాగా ప్లస్ అయింది అని అంటున్నారు జనాలు . నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది . అయితే తెలుగులో తొలి సినిమాతో ఫుల్ ఫామ్ సంపాదించేసుకుంది ఈ బ్యూటీ .
"నెమలి" అనే రాకుమార్తె పాత్రలో కట్టిపడేసింది . ఈ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్ అనుకున్నారట. కానీ చివరి నిమిషంలో కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట . దీంతో ఆ అవకాశం ప్రీతి ముకుందన్ ని వెతుక్కుంటూ వెళ్ళింది . అంతేకాదు నుపూర్ సనన్ కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారట . కానీ ఆమె కొన్ని కారణాలు చేత ఈ సినిమా నుంచి తప్పించుకోవడం.. ఆ తర్వాత ప్రీతి ముకుందని ఆ పాత్రలోకి రావడం చకచకా జరిగిపోయాయి . ఇప్పుడిప్పుడే కెరియర్ఊపందుకుంటున్న ప్రీతి ముకుందన్ కి కన్నప్ప లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నటించడం ఆమెకు చాలా ప్లస్ గా మారింది . ఇది ఆమె అదృష్టంగా భావించింది . ఈ సినిమా విజయంతో ప్రీతికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...??