నిర్మాతలలో స్టార్ నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న దిల్ రాజు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు.. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసిన ఈయన తీసిన సినిమాలేవి హిట్ కాక నష్టాల్లో కూరుకుపోయి అసలు ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నారట. కానీ చివరికి నితిన్ నటించిన దిల్ సినిమాని నిర్మిద్దాం అని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా ప్లాఫ్ అయితే ఇండస్ట్రీని వదిలి పోదాం అనుకున్నారట.కానీ నిర్మాతగా దిల్ రాజు చేసిన మొదటి సినిమా హిట్ కావడంతో అప్పటినుండి రాజు అనే పేరును కాస్త దిల్ రాజుగా మార్చుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలా స్టార్ నిర్మాతగా కొనసాగుతూ ఎన్నో సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలోనే స్టార్ పొజిషన్లోకి వచ్చారు. అయితే అలాంటి దిల్ రాజు మొదట అనితని పెళ్లి చేసుకున్నారు. 

వీరికి హన్షిత అనే కూతురు కూడా ఉంది.అలా ఎంతో సజావుగా సాగుతున్న వీరి కాపురంలో హఠాత్తుగా ఓ పిడుగు వచ్చి పడినట్టు అనిత గుండెపోటుతో మరణించింది. ఆ తర్వాత చాలా రోజులు దిల్ రాజు ఒంటరిగానే ఉన్నారు.కానీ 2020 లాక్ డౌన్ సమయంలో నిజామాబాద్ లోని ఓ టెంపుల్లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.అయితే దిల్ రాజు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన కూతురే అని చాలా సందర్భాల్లో చెప్పారు. కూతురు ఒత్తిడి చేయడం వల్లే దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారట. ఇక తేజస్విని రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజుకి మళ్ళీ ఓ కొడుకు పుట్టాడు. ఈ విషయం పక్కన పెడితే ఇండస్ట్రీ కి చాలా దూరంగా ఉండే దిల్ రాజు భార్య తేజస్విని రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ ని బయట పెట్టింది..

 తేజస్విని మాట్లాడుతూ.. అసలు మాకు సినిమాతో ఎలాంటి కనెక్షన్ కూడా లేదు.మేము సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక సినిమా చూసేవాళ్ళం. కానీ ఇలాంటి సినిమాలు నిర్మించే ఆయన ఇంటికి భార్యని అవుతానని నేను అస్సలు ఊహించలేదు. మేమిద్దరం ఫస్ట్ టైం ఫ్లైట్లో కలుసుకున్నాం. నేను ఎయిర్ హోస్టెస్ కావడంతో విమానంలో ఎక్కువగా తిరిగేదాన్ని.అలాగే దిల్ రాజు కూడా సినిమాల కోసం తరచూ విమాన ప్రయాణం చేయాల్సి వచ్చేది. అలా సంవత్సరం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉన్న నన్ను దిల్ రాజు గమనించారట.ఆ తర్వాత ఓ రోజు పెన్ కోసం అడిగి అప్పుడప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారు.  ఇక ఓ రోజు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని అడిగారు.

 నెంబర్ తీసుకున్నాక ఫోన్లు మాట్లాడడం మొదలు పెట్టిన దిల్ రాజుని చూసి నేను డైరెక్టర్ అనుకున్నా. కానీ ఆ తర్వాత గూగుల్ లో సెర్చ్ చేయగా నిర్మాత అని తెలిసింది. అయితే పెళ్లి చేసుకుంటానని దిల్ రాజు అనగా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని చెప్పాను. ఎందుకంటే మా పిన్ని,పెద్ద మామ, చిన్న మామ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు.దిల్ రాజుతో పెళ్లి అనగానే వద్దని చెప్పారు. అలాగే అప్పటికే దిల్ రాజుకి పెళ్లి అయింది. రెండో పెళ్లి అని అస్సలు ఒప్పుకోలేదు. కానీ దిల్ రాజు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరినీ స్వయంగా ఒప్పించారు. అలా మా ఇద్దరి పెళ్లి జరిగింది అంటూ తేజస్విని చెప్పుకొచ్చింది.అలా దిల్ రాజు ఐదు రూపాయల పెన్ను అడిగి తేజస్వినిని పడగొట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: