ఇప్పటికే అనేక మంది సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలా నటిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో సూపర్ గా సక్సెస్ అయిన వారు కూడా కొంత మంది ఉన్నారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించి తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకొని , అలాగే హిందీ సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా సూపర్ గా సక్సెస్ అయిన బ్యూటీ లలో కంగనా రనౌత్ ఒకరు.

ఈమె రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఏక్ నిరంజన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని సాధించకపోయినా , ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో కంగనా కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈమె ఎన్నో హిందీ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫైర్ బ్రాండ్ గా కూడా ఈమె గుర్తింపును సంపాదించుకుంది. 

కంగనా తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బి జె పి తరఫున పోటీ చేసింది. ఈమె ఎన్నికల్లో బరిలో నిలిచిన మొదటి సారి ఎంపీ గా గెలిచి రాజకీయాల్లో కూడా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యింది. ఇలా కంగనా నటిగా అద్భుతమైన గుర్తింపు సంపాదించుకోవడం మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ ను చూపించింది. ప్రస్తుతం ఈమె రాజకీయాల్లో చురకైన పాత్రను పోషిస్తూ తనదైన రీతిలో ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: