కుబేర తో మంచి హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల .. కోలీవుడ్ లో కలెక్షన్ తగ్గినప్పటికీ ఓవరాల్ గా సినిమా మంచి కలెక్షన్ల తో దూసుకుపోతుంది .. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆనందిస్తున్న శేఖర్ నెక్స్ట్ సినిమా కు చాలా టైం తీసుకోబోతున్నాడు .. అయితే ఆయన తర్వాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పేసాడు .. కచ్చితంగా నా నుంచి లవ్ స్టోరీ రాబోతుందని .. ఒక సామాజిక స్పృహతో ఆవేశంతో సినిమా తీసిన తర్వాత నేను ఎప్పుడు ప్రశాంతమైన సినిమా తీస్తాను .. అది నాకు అలవాటు నాకు నేను రివైండ్‌ చేసుకొని ఆ పని చేస్తుంటాను .. కాబట్టి ఇప్పుడు ఓ లవ్ స్టోరీనే నా నుంచి వస్తుంది ..


నా నమ్మకం ఏమిటంటే ఎంత టైం తీసుకున్న నా దగ్గర నుంచి వచ్చే సినిమా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది .. లవ్ స్టోరీ చేసిన అది ఎంతో కొత్తగానే ఉంటుంది కాకపోతే కొంత టైం పడుతుంది ..  ఇలా తన తర్వాత సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు శేఖర్ కమ్ముల .. తన కెరియర్ లో మంచి మ్యూజిక్ విజయాలు అందించిన కేఎం రాధాకృష్ణన్‌తో కలిసి పని చేయబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు.  ప్రధానంగా నాది కేఎం రాధాకృష్ణన్ కాంబినేషన్ ప్రధానంగా సెట్ అయ్యే అవకాశం ఉందని .. ఆనంద్ , గోదావరి సినిమాలు కలిసి చేసాం .. తర్వాత హ్యాపీ డేస్ తో మా ఇద్దరి కాంబినేషన్ కి కొంత బ్రేక్ వచ్చింది ..


ఎందుకంటే అది మోడరన్ సినిమా క్లాసికల్ మ్యూజిక్ అందుకు పనిచేయదు .. ఇప్పుడు మాత్రం రాధాకృష్ణన్ తో కలిసి కచ్చితంగా పనిచేస్తా ఆయనకు గ్యాప్ వచ్చిన కచ్చితంగా మళ్ళీ వస్తాడు టాలెంట్ ఎక్కడికి పోదు కదా .. కుబేర సినిమాలో పాత్రల గురించి అందరూ మాట్లాడుకుంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ శేఖర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .. ఇక మరి శేఖర్ తన తర్వాత సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని రికార్డులు అందుకుంటారు చూడాలి ...

మరింత సమాచారం తెలుసుకోండి: