
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస బెట్టి సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు .. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తున్న విషయం తెలిసిందే .. ఇక ఈ సినిమాలో ఆయన ఎంతో స్టైలిష్ లుక్ తో వింటేజ్ డార్లింగ్ వైబ్స్ ను చూపించబోతున్నారు .. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్ సినిమా పై అంచనాలు పెంచేసాయి .. ఇదే క్రమంలో మరో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ ‘ఫౌజీ’ అనే సినిమాలో నటిస్తున్నారు ..
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది ఇక ఈ సినిమాల్లో ప్రభాస్ ఓ ఆర్మీ సైనికుడు పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది .. అదే విధంగా ఈ సినిమా లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు .. కాగా ఈ సినిమా స్టేట్స్ నుంచి ప్రభాస్ లుక్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .. ఇక దాంతో ప్రభాస్ ఈ సినిమా లో మిర్చి మూవీ తరహా లుక్స్ లో ఉన్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు . నిజం గానే ప్రభాస్ గనుక ఆ లుక్స్ లో కనిపిస్తే అభిమానుల కు పండగ అని చెప్పాలి .. ఇక ఈ సినిమా లో అందాల భామ ఇమాన్వి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతుంది .. అలాగే ఈ సినిమా కి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు