కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఇక దివంగత నటి మంజుల ఈయన భార్య.. ఇక వీరి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వనిత విజయ్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన వనిత విజయ్ కుమార్ ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే సినిమాలలో కంటే నిరంతరం ఏదో ఒక విషయాలలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.



వనిత విజయ్ కుమార్ ఎప్పుడు వివాదాలలో  చిక్కుకుంటూ ఉంటుంది .వ్యక్తిగత విషయాలలో కూడా ఇప్పటికే మూడుసార్లు వివాహాలు చేసుకోవడంతో పాటుగా ముగ్గురికి డైవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే వనిత విజయకుమార్ నాలుగో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అయితే అందుకు సంబంధించి ఒక పాత వీడియోని కూడా పలువురు నెటిజెన్స్ వైరల్ గా చేస్తున్నారు. వనిత విజయ్ కుమార్ ప్రముఖ కొరియాగ్రాఫర్ రాబర్ట్ ను మ్యారేజ్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా అతను వనిత విజయ్ కుమార్ మెడలో తాళి కడుతున్న సమయంలో ఆమె చాలా ఎమోషనల్ గా అయినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే వనిత విజయ్ కుమార్, రాబర్ట్ ఇద్దరూ కలిసి మిస్సెస్& మిస్టర్ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించి డైరెక్షన్ మొత్తం కూడా వనిత విజయ్ కుమార్ చేస్తూ ఉన్నది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి శుభముహూర్తం అనే పాటకు సంబంధించి ఈ పెళ్లి వీడియోని చిత్రీకరించినట్లు సమాచారం. అయితే గతంలో కూడా వనిత విజయ్ కుమార్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో చాలామంది ఈమెను ట్రోల్ చేశారు. ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలలో ఎక్కువగానే నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: