టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు .. రీసెంట్ గానే కన్నప్ప సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన మంచు హీరో మరో సినిమా కి ఒకే చెప్పినట్టు తెలుస్తుంది .. అది కూడా ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు .. ఆయన దర్శకత్వం లో సరికొత్త సినిమా లో నటించబోతున్నాడు ఈ మంచు హీరో .. ఈ మేరకు ఇప్పటికే చర్చలు కూడా ఓకే అయినట్టు తెలుస్తుంది .. పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ను ప్రభుదేవా తీసుకురాబోతున్నారట .. కన్నప్ప సినిమా లోని పాటలకు ప్రభుదేవా అనే కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే ..

గతం లో కూడా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా , పౌర్ణమి లాంటి సినిమాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు .. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి . ఇక మరి చాలా రోజుల తర్వాత ఇప్పుడు మంచు విష్ణు తో కొత్త సినిమాను చేసినందుకు రెడీ అవుతున్నాడు ప్రభుదేవా .. ఇక మరి మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప రెండు రోజుల కిందట రిలీజై భారీ విజయ అందుకుంది .. కేవలం రెండు రోజుల్లోనే 42 కోట్లకు పైగా కలెక్షన్లు కన్నప్ప అందుకుంది .. ఈరోజు ఆదివారం కావటంతో కలెక్షన్స్ మరింత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .. అందుతున్న సమాచారం ప్రకారం మూడు రోజుల్లో 60 కోట్లు దాటుతుందని కూడా అంటున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: