దిల్ రాజు .. డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఒక స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు . ఎంతలా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని ఆయన శాసిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే . ఆయనపై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది ..పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి కానీ ఏ విషయాన్నీ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోడు దిల్ రాజు.  తన కష్టాన్ని తానే నమ్ముకుంటాడు. రీసెంట్గా ఆయన బ్రదర్ శిరీష్ చేసిన వ్యాఖ్యలు మెగా పవర్ ఫ్యాన్స్  ని ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన బ్రదర్ చేత సారీ కూడా చెప్పించాడు.  అలాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దిల్ రాజు .


దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ "తమ్ముడు".  నితిన్ కెరియర్లో ఈ సినిమా చాలా చాలా స్పెషల్ . కాగ ఈ సినిమాలో లయ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . కాగా ఈ సినిమా జులై 4వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . అయితే సినిమా రిలీజ్ కి ముందే ఆయన బ్రదర్ శిరీష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడం సినిమాకి నెగిటివిటీ క్రియేట్ చేసేలా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  ఇదే మూమెంట్లో దిల్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.  కన్నప్ప సినిమాకి మంచు విష్ణు చేసిన పని తమ్ముడు సినిమాకి కూడా చేయబోతున్నాం అంటూ తెలియజేశాడు .



మంచు విష్ణు కన్నప్ప సినిమాకి ముందే సినిమా గురించి నెగటివ్ పోస్టులు పెట్టిన.. వ్యక్తిగత విషయాలను ఇబ్బందికరంగా ట్రోల్ చేసిన .. ఉద్దేశం పూర్వకంగా సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన ఊరుకునేదే లేదు అంటూ పర్సనల్ పరువుకి భంగం కలిగించే  రివ్యూలు ఇస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తూ పబ్లిక్ కషన్ నోటీస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది . రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్ .. నెగిటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు.  దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాలని చూస్తుంది సినిమా ఇండస్ట్రీ .



ఈ క్రమంలోనే జూలై 4 రిలీజ్ అవుతున్న తమ్ముడు సినిమాకి కూడా ఇలాంటి ఒక పద్ధతిని ఫాలో అవ్వాలి అంటూ ట్రై చేస్తున్నాడు దిల్ రాజు ."కన్నప్ప చిత్ర బృందం మంచి నిర్ణయం తీసుకుంది.  రిలీజ్ కు ముందే అలా హెచ్చరిక జారీ చేస్తే ఫేక్ రివ్యూస్ ..నెగిటివ్ ట్రోలింగ్ .. తగ్గిపోతుంది. అయితే రివ్యూస్ ని ఆపడం మా ఉద్దేశం కాదు . రివ్యూస్ రాయండి రాసేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి . సినిమాపై కావాలని నెగిటివ్ రివ్యూరాస్తే ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే గుర్తుంచుకోండి . ఈ సినిమా కాకపోతే మరొక సినిమాతో హిట్ కొడతారు హీరో , డైరెక్టర్. కానీ నిర్మాతకి ఆ సినిమా నష్టాలు తీసుకొస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుంది.  దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు డ్యామేజ్ మాత్రం చేయొద్దు "అంటూ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సినిమాని కాపాడడానికి ఎవరు ఏ మంచి పని చేసిన మేమంతా సపోర్ట్ చేస్తామని ఫాలో అవుతామని చెప్పుకొచ్చారు. దీంతో ఫేక్ రివ్యూస్ ఫేక్ కామెంట్స్ చేసే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా మారిపోయింది.  దిల్ రాజు దీనిపై సీరియస్గా యాక్షన్ తీసుకునే  విధంగా ముందుకు వెళ్తున్నట్లు సినీ వర్గాల నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: