బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే తెలుగు ప్రేక్షకులకు కల్కి సినిమాతో బాగా సుపరిచితమైయ్యింది. బాలీవుడ్ చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడంతో కూడా మరింత క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా దీపికాకు భారతీయ సినీ పరిశ్రమకు  గర్వకారణంగా నిలిచేటువంటి హాలీవుడ్ ప్రఖ్యాత వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ అనే అవార్డుకు దీపికా ఎంపికైనట్లుగా తెలుస్తోంది. లాస్ ఏంజెల్ లోని ప్రముఖ ఫుట్ పాత్ పైన కూడా దీపికా పేరు చెక్కించుకునేటువంటి ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నది.



ఇలాంటి గౌరవం అందుకుంటున్న మొట్టమొదటి ఇండియన్ నటిగా ఒక చరిత్రను సృష్టిస్తోంది దీపికా పదుకొనే. ఈ విషయం విన్న అభిమానులు కూడా కొంతమేరకు ఆనంద పడుతున్నారు. హాలీవుడ్ వాక్ ఫ్రేమ్ క్లాస్ అఫ్ 2026 లో భాగంగా ఈమె పేరును మెన్షన్ చేశారు.. మొత్తం మీద ఈ జాబితాలో 35 మంది పేర్లు ఉండగా దీపికాతో పాటుగా ఈ జాబితాలో రాజ్యల్ మేక్ అడమ్స్, డెమి యూర్, రామీ మలేక్, ఎమిలీ బ్లంట్, తదితరులు ఉన్నారట. అలాగే ఈ ఏడాది ఎంపికైన వారిలో ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ టీవీ సాంగీతం థియేటర్ ఇలా ఐదు విభాగాల నుంచి కూడా ప్రతిభావంతులు ఉన్నారు.


2017లో XXX రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్ సినిమాతో హాలీవుడ్ లోకి దీపికా పదుకొనే ఎంట్రి ఇచ్చింది. ఇందులో హాలీవుడ్ స్టార్ విస్ డీజిల్ సరసన జోడిగా నటించినది. దీపికా పదుకొనే అందుకున్న ఈ అరుదైన గౌరవం సినీ పరిశ్రమకు, మహిళ నటులకు ప్రతిష్టకు సైతం ప్రపంచ వేదిక పైన మరింత పేరు సంపాదించేలా చేసిందని చెప్పవచ్చు. దీంతో అటు పలువురి సిని సెలబ్రెటీలు అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే కల్కి 2 చిత్రంలో పాటుగా బ్రహ్మాస్త్ర 2 చిత్రాలలో అలాగే పఠాన్ సీక్వెల్లో కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: