సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఆమీర్ ఖాన్ ఈ మూవీ లో ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... శృతి హాసన్ , ఉపేంద్రమూవీ లో ఓ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. పూజ హెగ్డే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్లో కనిపించనుంది.

ఇలా అనేక మంది అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీ నటులు ఈ సినిమాలో భాగం అయ్యారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానితో ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా ఏసియన్ సునీల్మూవీ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏకంగా 52 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులు కూడా అత్యంత భారీ ధరకు రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క ఓవర్సీస్ హక్కులను 80 కోట్ల భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ ఓవర్సీస్ ఏరియాలో కూడా సూపర్ సాలిడ్ డీల్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ ఇంత పెద్ద మొత్తాన్ని రికవరీ చేయడం కాస్త కష్టం అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: