కామెడీ విలన్ గా..విలన్ గా.. ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీలు పాడయ్యి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఫిష్ వెంకట్ ఎక్కువగా ఫ్రెండ్స్ తో మద్యం సేవించడం వల్లే ఇలా జరిగిందని రీసెంట్ గా ఫిష్ వెంకట్ భార్య చెప్పిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయం పక్కన పెడితే గత నాలుగు సంవత్సరాల నుండి తండ్రిని కి డయాలసిస్ చేపిస్తూ కాపాడుకుంటున్నామని కిడ్నీ మార్చితే తప్ప తండ్రి బతకడానికి వైద్యులు తేల్చేసారని, నా తండ్రి కిడ్నీ ఆపరేషన్ కి దాదాపు 50 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఆదుకోవాలి అంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.. అంతేకాదు రోజురోజుకి ఆరోగ్యం క్షిణిస్తుందని రెండు కిడ్నీలు పాడవ్వడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, వెంటనే ఇండస్ట్రీ నుండి మాకు ఎవరైనా సహాయం చేసి మా నాన్నను బతికించాలని కన్నీళ్లు పెట్టుకుంది. 

కనీసం నాన్న మాట్లాడే స్టేజిలో కూడా లేడని మీడియా ముందు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఫిష్ వెంకట్ కి సాయం అందినట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ గారి అసిస్టెంట్ నుండి మాకు కాల్ వచ్చింది.. ప్రభాస్ గారు నాన్నకి జరిగే ఆపరేషన్ ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పారు. ఆయన టీం నుండి కాల్ రావడంతో నేను చాలా సంతోషపడ్డా..అలాగే కిడ్నీ డోనర్స్ ఎవరైనా ఉంటే వెతుక్కోమని చెప్పారు. ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తామని అన్నారు.ఇక నా బ్లడ్ గ్రూప్ కలవకపోవడంతో మా నాన్నకి నా  కిడ్నీ ఇవ్వలేకపోతున్నాను. అలాగే మా నాన్న సోదరుడు బ్లడ్ గ్రూప్ కలిసినప్పటికీ ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన కిడ్నీ కూడా వద్దు అని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం పలు సంస్థలకు ఫోన్ చేసి కిడ్నీ డోనర్స్ కోసం వెతుకుతున్నాం..

 అంటూ మీడియా ముందు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి చెప్పుకొచ్చింది. అయితే ప్రభాస్ సాయం చేస్తానని చెప్పాడంటూ ఫిష్ వెంకట్ కూతురు తెలియజేయడంతో చాలామంది ప్రభాస్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభాస్ సాయం అందిస్తారని, మరోసారి తన గొప్ప మనసు బయట పెట్టుకున్నాడని, గొప్పోడివయ్యా స్వామి అంటూ కామెంట్లు పోస్ట్లు పెడుతున్నారు. అంతేకాదు ఫిష్ వెంకట్ ఇప్పటివరకు ఎంతోమంది హీరోల సినిమాల్లో నటించారు.కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ముందుకు వచ్చి సాయం చేయలేదు.కానీ ప్రభాస్ ముందుకు రావడంతో ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి అనే సీన్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అలాగే ఆది,దిల్,నాయక్, అత్తారింటికి దారేది,బన్నీ, డాన్ శీను వంటి ఎన్నో సినిమాల్లో నటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: