జయం సినిమాతో హీరోగా నిలదొక్కుకున్న నితిన్ ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ కొట్టడంతో నితిన్ కి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక నితిన్ తండ్రి కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే కావడంతో సినిమా ఇండస్ట్రీకి అనుబంధంగానే పెరిగాడు. తన తండ్రి నైజం లో డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసేవారు.దీంతో సినిమాల్లోకి రావడానికి నితిన్ కి పెద్ద కష్టమేమి కాలేదు. ఇక జయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక దిల్ సినిమా చేశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్.. రెండు సినిమాలు వరుస హిట్స్ కొట్టడంతో నితిన్ కెరీర్ మారిపోయింది. ఆ తర్వాత సంబరం, శ్రీ ఆంజనేయం వంటి రెండు ఫ్లాప్ సినిమాలు పడినప్పటికీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సై మూవీ నితిన్ కెరీర్ ని నిలబెట్టింది. ఆ తర్వాత వరుస డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొని ఇష్క్,గుండెజారి గల్లంతయ్యిందే వంటి రెండు సినిమాలతో మళ్ళీ పుంజుకున్నాడు.

 ఈ సినిమా తర్వాత మరో మూడు ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి.ఆ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో అఆ సినిమా చేశారు. ఇక అఆ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో చెప్పనక్కర్లేదు. అయితే అఆ సినిమా తర్వాత నితిన్ ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా అట్టర్ ప్లాఫ్ లుగానే నిలిచాయి. అఆ మూవీ తర్వాత దాదాపు 11 సినిమాలు చేస్తే అందులో 10 సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరి ఇంతకీ ఆ సినిమాలేంటయ్యా అంటే.. అ ఆ సినిమా తర్వాత నితిన్ చేసిన లై,ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం, చెక్,మాస్ట్రో, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తాజాగా విడుదలైన తమ్ముడు. ఇలా ఏకంగా 10 సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి.ఇక ఇందులో భీష్మ సినిమా ఒక్కటి హిట్ కొట్టినప్పటికీ మిగిలిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో అఆ సినిమా తర్వాత నటుడిగా నితిన్ కెరీర్ మొత్తం కిందికి పడిపోయింది అని చెప్పుకోవచ్చు.

అంతే కాదు ఈయన మార్కెట్ రోజు రోజుకి పడిపోవడంతో నితిన్ కి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడం ఖాయం అని సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నితిన్ అర్జెంటుగా ఒక హిట్ కొట్టాలి అని చూస్తున్నారు.ఇప్పటికే రాబిన్ హుడ్, తమ్ముడు రెండు సినిమాలపై అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఇందులో ఏ ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. దాంతో నితిన్ ఆశలన్నీ బలగం వేణు డైరెక్షన్లో రాబోతున్న ఎల్లమ్మ సినిమా పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాతోనే తనకి హిట్ రావాలి అని కోరుకుంటున్నారు.ఒకవేళ ఈ సినిమా కూడా అటు ఇటుగా రిజల్ట్ వస్తే మాత్రం నటుడిగా నితిన్ కెరీర్ ముగిసినట్టే అంటున్నారు చాలామంది సినీ విశ్లేషకులు. మరి చూడాలి బలగం వేణు ఎల్లమ్మ మూవీతో నితిన్ కి హిట్ ఇస్తారా లేదా అనేది..

మరింత సమాచారం తెలుసుకోండి: