ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్ .. తెలుగు , మలయాళం , బెంగాలీ సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది .. అలాగే ఆమె నటనతో పాటు అందమైన కళ్ళను సైతం ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారు .. ప్రముఖ చిత్ర నిర్మాత సత్యజిత్ రే ఆమె ఓ ఈవెంట్లో డాన్స్ చేయడం చూసి ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు .. అలా 1994 నుంచి 2003 వరకు మాత్రమే ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నప్పటికీ .. గ్లామర్ పాత్రలు చేయడానికి నో చెప్పింది ..ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సువలక్ష్మి .. కోల్కత్తాకు చెందిన సువలక్ష్మి .. చదువుకునే రోజుల్లోనే ఆమెకు దర్శకుడు సత్యజిత్ రే  అవకాశము ఇచ్చారు .


అయితే ఆ  సమయంలో ఆమె సోదరుడు ఒక ప్రమాదంలో చనిపోయారు ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి వెళ్ళింది .. అదే సమయంలో ఆమెకు అజిత్ మూవీ ఆసై సినిమాలో అవకాశం వచ్చింది .. ఈ మూవీలో యమున పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించింది .. అలా మొదటి సినిమాతోనే నటిగా ఎన్నో ప్రశంసలు తెచ్చుకుంది .. ఇలా ఒక వైపు నటిగా సినిమాలు చేస్తూనే . మరోవైపు తన సోదరుడు కలను నెరవేర్చడానికి లాయర్ విద్యను కూడా పూర్తి చేసింది ..  ఆసై సినిమా తర్వాత ఈమెకు కోలీవుడ్ లో వరుస‌ అవకాశాలు వచ్చాయి .. అలా కార్తీక్ తో కలిసి ‘గోకులతిల్ సీతై’లో కూడా నటించడంతో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది .



ఇలా తమిళం తో పాటు తెలుగులోను ఈమె ఎన్నో సినిమాలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి .. అయితే కెరియర్ మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడు ఈమె గ్లామర్ పాత్రలో నటించలేదు .. ఏ సినిమాలోలైనా చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా ఆనందంగా కనిపించింది .. స్టార్ హీరోలతో పని చేసినప్పటికీ ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది .. అలా 2001 నుంచి సినిమా పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పి న్యాయవాద వృత్తిని కొనసాగించాలని కీలక నిర్ణయం తీసుకుంది .. అలా 2002లో తన చిన్ననాటి స్నేహితుడైన స్వాగత్‌ బెనర్జీని పెళ్లి చేసుకుంది .. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది సువలక్ష్మి తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ న్యాయవాదిగా  తన వృత్తిని కొనసాగిస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: