టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో రెజీనా ఒకరు. ఈ ముద్దుగుమ్మ 2005 లో విడుదలైన తమిళ చిత్రం కండనాల్ మొదల్ సినిమాతో సినీ రంగం లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈమెకు తెలుగులో SMS (శివ మనుసులో శృతి) అనే సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు అయింది. ఈమె కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మంచి విజయాలను సాధించడం , అలాగే ఆ సినిమాల్లో ఈమె తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి మంచి విజయాలు దక్కినట్లయితే చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకుంటుంది అనే కూడా చాలా మంది భావించారు.

కానీ ఆ తర్వాత ఈమెకు మంచి విజయాలు దక్కలేదు. దానితో ఈమె కెరియర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది. ఈమె కొంత కాలం క్రితం మెగాస్టార్  చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య మూవీ లో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ మూవీ లో రెజీనా చేసిన స్పెషల్ సాంగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈమె వయస్సు 34 సంవత్సరాలు. దానితో ఈమెకు తన పెళ్లి గురించి ప్రశ్నలు చాలానే ఎదురవుతూ వస్తున్నాయి.

తాజాగా కూడా రేజీనా కు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురవగా ఆమె దానికి అదిరిపోయే రేంజ్ లో సమాధానం ఇచ్చింది. తాజాగా రెజీనా తన పెళ్లి గురించి స్పందిస్తూ ... నా పెళ్లి గురించి నా తల్లి నన్ను అడగడం లేదు. మీకు ఎందుకు నా పెళ్లి గురించి అంత అవసరం. అలాగే తనతో ఎవరైనా రిలేషన్ పెట్టుకున్న వారికే కష్టం అని రెజీనా చెప్పుకొచ్చింది. ఇకపోతే ప్రస్తుతం రెజీనా పర్వాలేదు అనే స్థాయి సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: