కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను కొనసాగించిన వారిలో లయ ఒకరు. ఈమె ఎన్నో తెలుగు సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. లయ 1999 వ సంవత్సరం విడుదల అయిన స్వయంవరం అనే సినిమాతో సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును ఈ బ్యూటీ దక్కించుకుంది. ఆ తర్వాత ఈమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె మూడు నంది అవార్డులను గెలుచుకొని నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత లయ పూర్తిగా సినిమాలకు దూరం అయింది. చాలా కాలం లాంగ్ గ్యాప్ తర్వాత ఈమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందిన తమ్ముడు సినిమాలో లయ , నితిన్ కి అక్క పాత్రలో నటించింది.  ఈ మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. తాజాగా లయ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన చిన్న నాటి జ్ఞాపకాలను తెలియజేసింది. తాజా లయ మాట్లాడుతూ ... నేను రెండవ తరగతి చదువుకున్న రోజుల్లోనే చెస్ కాంపిటేషన్లలో పాల్గొనే దానిని. నేను చెస్ లో ఏడు సార్లు రాష్ట్ర అవార్డ్స్ , ఒక సారి నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాను. అలా రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చెస్ పై చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాను. కానీ ఆ తర్వాత అది కుదరలేదు. చెస్ కోచింగ్ అంటే గంటల తరబడి దానిపై కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కానీ టెన్త్ , ఇంటర్ చదువు వల్ల అది కుదరలేదు. దానితో దానిని వదిలి వేశాను అని లయ తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: