- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఐదేళ్లుగా షూటింగ్లో మగ్గుతున్న హరిహర వీరమల్లు సినిమాను నిర్మాత ఏం రత్నం చాలా పట్టుదలతో ధైర్యంగా పూర్తి చేశారు. సినిమా విడుదల టైం మరో రెండు వారాలకు వచ్చినా మార్కెటింగ్ మీద అసలు తొందరపడటం లేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేయాలని ఓపికగా ఎదురు చూశారు. ట్రైలర్ వచ్చాక కంటెంట్ మీద బాగా నమ్మకం కుదిరింది. ట్రైల‌ర్ చూశాక‌ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊగిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా నమ్మకాలు లేని సినీ ప్రేమికులు కూడా ఇదేదో కచ్చితంగా హిట్ అయ్యేలా ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే బయ్యర్లు అందరికీ హరిహర వీరమల్ల మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అసలు రేటు ఎంత ఉంటుంది ? అన్నది నిర్మాత వైపు నుంచి బయ్యర్లకు ఇంకా క్లారిటీ లేదు.


ముందుగా నైజం అమ్మితే ఆ తర్వాత ఆంధ్ర - సీడెడ్ అమ్మ వచ్చు అన్న లెక్కల్లో నిర్మాత రత్నం ఉన్నట్టు తెలుస్తోంది. నైజాం ఏరియాకు 65 కోట్లు చెబుతున్నట్టు సమాచారం. నైజాం 65 కోట్లు అంటే సీడెడ్ మిన‌హా ఏపీ 75 నుంచి 80 కోట్లు ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ రేటు ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెడితే ముందు చకచకా మార్కెట్ కంప్లీట్ చేయాలి. మరో రెండు వారాలలో వారాల్లో సినిమా ప్రమోట్ చేయాలి.. బ‌య్య‌ర్లు  రెడీగా ఉన్నారు. ఇప్పుడు రత్నం వైపు నుంచే రేటు బయటకు రావాల్సి ఉంటుంది. నైజాం 65 కోట్లు అంటే సినిమా హిట్ అయినా.. యావ‌రేజ్ అయినా  అందరూ బయటపడతారు ఏమాత్రం తేడా వచ్చిన బలైపోవాల్సిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: