దాదాపు 1000 కోట్ల బిజినెస్ కు పరీక్షగా మారబోతోంది రాబోతున్న రెండు సినిమాల ఫైట్. రజనీకాంత్ ‘కూలీ’ జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల ‘వార్ 2’ మూవీల మధ్య జరగబోతున్న ఫైట్ లో విజేత ఎవరు అన్న ఆశక్తి దేశవ్యాప్తంగా ఉంది. వాస్తవానికి ‘వార్ 2’ కంటే ‘కూలీ’ క్రేజ్ విషయంలో ముందు వరసలో ఉన్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా ‘వార్ 2’ నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహాలు ‘కూలీ’ మూవీకి చెక్ పెట్టె విధంగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.


బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 9000 స్క్రీన్లను ‘వార్ 2’ కోసం ముందుగానే బుక్ చేసి రజనీకాంత్ ‘కూలీ’ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు అంటూ బాలీవుడ్ మీడియా హంగామా చేస్తోంది. ఈ వార్తలే నిజం అయితే ‘2.0’ ‘ ఆర్ ఆర్ ఆర్’ ‘పుష్ప 2’ కన్నా అతి పెద్ద రిలీజ్ రికార్డ్ ‘వార్ 2’ కి దక్కుబోతోందిఅన్న వార్తలు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా ‘వార్ 2’ చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న నేపద్యంలో  జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై ఒక మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈపాట ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకంటే మాస్ ప్రేక్షకులకు యూత్ కు బాగా నచ్చే విధంగా కొరియోగ్రఫీ పై శ్రద్ద పెట్టడంతో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ లు వేసే స్టెప్స్ తో ధియేటర్లు అధిరిపోతాయని అంటున్నారు.


‘కూలి’ మూవీ విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించి అనిరుద్ రవిచందర్ చేస్తున్న రీ రికార్డింగ్ ఈ మూవీకి హైలెట్ గా మారుతుందని అంటున్నారు. ఈ మూవీలో నెగిటివ్ పాత్రలో నాగార్జున నటిస్తున్న నేపధ్యంలో ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలలో కూడ మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఇమేజ్ ఈమూవీకి ప్లస్ గా మారవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: