
చిత్ర బృందం కూడా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ల ను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ట్రైలర్ విడుదల కాక ఇందులో హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసిన సన్నివేశాలతో ట్రైలర్ మొదలవుతుంది. విష్ణువు పైన భక్తితో ఉండే ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి అయిన హిరణ్యకశివుడు ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీంతో తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగి వచ్చిన విష్ణు అవతారమే మహావతార్ నరసింహుడు.
ఇక నరసింహస్వామి రాకతో ట్రైలర్ మరింత ఆకట్టుకోవడమే కాకుండా చూసిన వారందరికీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ విజువల్ వండర్ గా కొనసాగుతున్నాయి. ఇండియన్ హిస్టరీ కి సంబంధించి ఒక ఐకానిక్ కథ కాబట్టి ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నది. ఇక ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. మహావతార్ సినిమాటిక్ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా యానిమేటెడ్ పిక్చర్ ని ట్రైలర్తో ఆవిష్కరించామని ఇదంతా కూడా నరసింహస్వామి కృపతోనే ఆవిష్కరించామని వెల్లడించారు. ప్రతి ఒక్క ప్రేక్షకులను గుర్తు పెట్టుకొని మరి భారతీయ సంస్కృతిని అందుకు తగ్గట్టుగా వాతావరణాన్ని చూపించేలా ఇందులో చేశామని వెల్లడించారు. మరి ట్రైలర్ తో బాగా ఆకట్టుకుంటున్న నరసింహస్వామి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.