సీరియల్ ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీమణులు వెండితెర మీద హీరోయిన్ లలాగే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా సీరియల్ లో చేసే ఆర్టిస్టులు కేవలం సీరియల్స్ లోనే కాకుండా సినిమాల్లో కూడా హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో హీరో చెల్లెలు క్యారెక్టర్ లో నటిస్తూ ఉంటారు. అలా ఈ నటి కూడా చాలా సంవత్సరాల నుండి సినిమాల్లో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ లో హీరో చెల్లెలు క్యారెక్టర్ లలో నటిస్తున్నారు.. మరి ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే శాండ్రా. ప్రముఖ ఛానల్ జీ తెలుగులో కలవారి కోడలు అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చి దాదాపు పదికి పైగా సీరియల్స్ లో చేసింది. అలా ముద్దమందారం, శుభాస్య శీఘ్రం, రాధమ్మ కూతురు వంటి పలు సీరియల్స్ లో నటించిన శాండ్రా కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా చాలా సినిమాల్లో కూడా నటించింది. 

ప్రస్తుతం జీ తెలుగులో ఆటో విజయశాంతి అనే కొత్త సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది.ఇదిలా ఉంటే తాజాగా శాండ్రా తన ప్రియుడిని పరిచయం చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక గుడ్ న్యూస్ చెప్పింది.మరి ఇంతకీ శాండ్రా పెళ్లి చేసుకోబోయే ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన కూడా సీరియల్ నటుడే బుల్లితెర మహేష్ బాబు గా పేరు తెచ్చుకున్న నటుడు కాళిదాసుని శాండ్రా పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియజేసింది.ఇక శాండ్రా కాళిదాసుతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ 'నీకోసం నేను వెతకకుండానే నాకోసం నువ్వు దొరికేసావ్ నువ్వు నా అద్భుతం' అంటూ ఫోటో కింద క్యాప్షన్ ఇచ్చింది. దీంతో శాండ్రా కాళిదాసు పెళ్లి విషయం అందరికీ తెలిసింది. అయితే చాలా రోజుల నుండి శాండ్రా కాళిదాసుతో సన్నిహితంగా ఉంటూ ఆయనతో వీడియోలు తీస్తుంది. కానీ సీరియల్ ఆర్టిస్టుల మధ్య ఉండే కోఆర్డినేషన్ అనుకున్నారు.

కానీ సడన్గా ప్రేమ పెళ్లి విషయాన్ని అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయిపోయారు.ఇక తన ప్రేమ విషయాన్ని అనౌన్స్ చేయడంతో బుల్లితెర ఆర్టిస్టులు చాలామంది ఈ జంటకి కంగ్రాట్స్ చెప్పారు. కాళిదాసు కూడా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించారు. అలా శుభస్య శీఘ్రం, మనసిచ్చి చూడు సీరియల్స్ చేశారు. శుభాస్య శీఘ్రం సీరియల్ టైంలోనే శాండ్రా,కాళిదాసు మధ్య పరిచయం ఏర్పడి పెళ్లి వరకు దారితీసినట్టు తెలుస్తోంది. ఇక శాండ్రా విషయానికి వస్తే.. ఆమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుంది.కానీ ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెతో పాటు మరో అమ్మాయితో కూడా ఎఫైర్ పెట్టుకోవడంతో విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత చాలా రోజులు డిప్రెషన్లో ఉన్న శాండ్రా మళ్ళీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈ విషయాన్ని స్వయంగా శాండ్రా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అలా ఫైనల్గా శాండ్రా మళ్ళీ రెండో పెళ్లికి రెడీ అయిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: