పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఆయన చివరిగా ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాల్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. అయితే గత ఏడాది టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుని ఇచ్చిన సీట్లలో పూర్తి మెజారిటీతో జనసేన పార్టీ గెలిచింది. అయితే పవన్ కళ్యాణ్ పనితనం బాగుండడంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీలో మరిన్ని చేరికలు ఉండడంతో పాటు మరిన్ని సీట్లు గెలిచే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఎలాంటి పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకోసమే పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉండాలని చూస్తున్నారట. కానీ ప్రస్తుతం ఒప్పుకున్న హరిహర వీరమల్లు, ఓజి రెండు సినిమాలు కంప్లీట్ చేశారు. హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీగా ఉంటే ఓజి షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ లో విడుదలకి సిద్ధమైంది.

ఇక మిగిలింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక్కటే..ఈ సినిమా కూడా పూర్తి చేసి రాజకీయాల్లోనే సెటిల్ అవ్వాలని చూస్తున్నారు. అయితే ఇలాంటి వేళ మెగా అభిమాని అయినటువంటి ఓ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ తో కచ్చితంగా సినిమా చేస్తానంటూ చెబుతున్నారు.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే..మెహర్ రమేష్.. డైరెక్టర్ మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా అనుకున్నంత హిట్ అయితే కలదు. ఈయన మెగా అభిమాని కావడంతో చిరంజీవితో ఒక్కసారైనా సినిమా చేసే అవకాశం రావాలని కోరుకున్నారు. అలా భోళా శంకర్ సినిమాతో ఆయన కోరిక నెరవేరినప్పటికీ ఆ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ అయింది. అయితే అన్నతో చేస్తేనే భారీ ప్లాప్ అయ్యిందంటే మళ్ళీ తమ్ముడితో కూడా సినిమా చేస్తాను అంటూ మెహర్ రమేష్ చెబుతున్నారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మెహర్ రమేష్ మాట్లాడుతూ.. కచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తా.భవిష్యత్తులో అయినా నా కోరిక నెరవేర్చుకుంటా అంటూ మాట్లాడారు. అయితే మెహర్ రమేష్ మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ వద్దు బాబోయ్ ఇప్పటికే చిరంజీవితో తీసి ఆయనకు డిజాస్టర్ అందించావు. మళ్లీ పవన్ తో తీసి  ఆయన ఖాతాలో కూడా డిజాస్టర్ వేస్తావా.. నీకు నీ డైరెక్షన్ కి ఓ దండం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన శక్తి, బిల్లా,షాడో, భోళా శంకర్, కంత్రి వంటి వరుస సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: