విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిన కింగ్ డమ్ మూవీ మరికొన్ని రోజుల్లో  థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కగా  ఈ నెల 31వ తేదీన  రిలీజ్ కానున్న  ఈ సినిమా కోసం  ప్రేక్షకులు  ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత నాగవంశీ  ఈ సినిమా ప్రమోషన్స్ లో   భాగంగా  ఆసక్తికర విషయాలను వెల్లడించడం  జరిగింది.

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో  తెరకెక్కిన జెర్సీ సినిమాలో  ట్రైన్ సీన్ హైలెట్  గా నిలిచిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో కూడా అలాంటి  సీన్ ఒకటి ఉందని  సమాచారం అందుతోంది.   ఆ సీన్ సినిమాను మలుపు తిప్పే సినిమా అవుతుందని కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  కొన్ని సీన్లు పేపర్ పై ఒకలా  సినిమాలో చూడటానికి మరో విధంగా ఉంటాయనే సంగతి తెలిసిందే.  కింగ్ డం  సినిమాలో హై  మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

కింగ్డమ్ సినిమాలో నాలుగైదు బ్లాక్స్ వేరే లెవెల్ లో ఉంటాయని  సమాచారం అందుతోంది.  విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని  కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.  నిర్మాత నాగవంశీ సైతం  ఈ కామెంట్లు చేస్తున్నారు.  కింగ్ డం   గుడ్ మూవీ అవుతుందని  నాగవంశీ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఒకింత భారీ బడ్జెట్ తోనే   ఈ సినిమా తెరకెక్కుతోం'దని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో  బ్రదర్ ఎమోషన్ ఉంటుందని   సమాచారం అందుతోంది.  కింగ్ డం  సినిమాలో భాగ్యశ్రీ  నటించారు.  ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ థాట్ ప్రాసెస్ ను జడ్జ్ చేసే పొజిషన్ లో ఉండలేకపోతున్నామని  నాగవంశి  తెలిపారు.  ప్రేక్షకులకు ఏ సినిమా  ఎందుకు నచ్చుతుందో  నాకు అర్థం కావడం లేదని  ఆయన చెప్పుకొచ్చారు.   కింగ్ డం  సినిమా  రేంజ్  ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: