టాలీవుడ్ చాలా కష్ట పరిస్థితులలో ఉంది. హిందీ డబ్బింగ్ డిజిటల్ హక్కుల రూపంలో ఇబ్బ‌డి ముబ్బుడిగా ఆదాయం రావడంతో థియేటర్లను ఒక విధంగా విస్మరించారు. ఇప్పుడు ఆ థియేటర్ ఆదాయానికి సమస్య వ‌చ్చిపడుతుంది. థియేటర్ ఆదాయం ఉన్నప్పుడు ఇండస్ట్రీ బాగానే ఉంది. ఆ ఆదాయానికి తోడు శాటిలైట్ ఆదాయం వచ్చినప్పుడు పెద్దగా మార్పు లేదు. అదన ఆదాయం హీరోలకు కలిసి వచ్చింది. నిర్మాతలకు కూడా కొంతవరకు క‌వ‌ర్‌ అయింది. ఆ తర్వాత హిందీ డబ్బింగ్ ఆదాయం తోడైంది. ఇది మరింత ఊతం ఇచ్చింది. హీరోల రెమ్యూనరేషన్ పెరిగాయి. నిర్మాతలకు ధైర్యం వచ్చింది. ఇలాంటి టైంలో ఓటిటి ఆదాయం రావడం మొదలైంది. ఇదే సినిమా ఇండస్ట్రీని మరింత బాగు చేస్తుంది అనుకుంటే తీవ్రంగా అతలాకుతలం చేస్తుంది.


ఓటీటీల దెబ్బకు శాటిలైట్  , థియేటర్ ఆదాయాలు పడిపోయాయి. ఎప్పుడైతే ఓటిటీ ఆదాయం రావడం మొదలైందో అప్పటికి ఇంకా శాటిలైట్ , హిందీ డబ్బింగ్ ఆదాయాలు బలంగా ఉన్నాయో ? అప్పుడు హీరోలు తమ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారు. అయినా నిర్మాతలకు ఇబ్బంది లేదు. కానీ అంతలో ఉన్న సీన్ రివర్స్ అయింది. ఓటిటి వల్ల శాటిలైట్ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శాటిలైట్ ఆదాయం అసలు లేని పరిస్థితికి వచ్చేసింది. కొన్ని సినిమాలను ఓటిటి సంస్థలు అన్ని భాషల్లోకి అనువదించి రిలీజ్ చేస్తూ ఉండటంతో హిందీ డబ్బింగ్ ఆదాయం తగ్గిపోవడం మొదలైంది. ఇక ఓటిటి సంస్థలకు తమ దగ్గర కావాల్సినంత కంటెంట్ వ‌చ్చి పడటంతో సెలెక్టివ్ గా సినిమాలు కొనడం ప్రారంభించాయి.


దీంతో చాలా ప్రాజెక్టులు అమ్మకాలు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు సినిమా నిర్మాణాలు తగ్గిపోతున్నాయి. ఒక్కసారిగా ఆదాయం కలసిన హీరోలు ఇప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఓటిటి అమ్మకాలు అందరూ నిర్మాతలకు సాధ్యం కావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో థియేటర్ ఆదాయం మాత్రమే చివరి ఆశ‌గా మిగిలింది. కానీ దానిని కూడా ఓటిటి కొంతవరకు తగ్గించింది. మరోవైపు థియేటర్ల ఇబ్బందులు చాలా ఉన్నాయి. చాలా థియేటర్లు మూసేస్తున్నారు.. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అసలు మిడిల్ రేంజ్ సినిమాలు చూసేందుకు థియేటర్లో ప్రేక్షకులకు రావటం లేదు. టాలీవుడ్ తీవ్రమైన సంక్లిష్ట పరిస్థితులలో కూరుకుపోయింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: