టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన హీరోగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత కొంత కాలం పాటు మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ను అద్భుతమైన జోష్లో ముందుకు సాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో ఈయన నటించిన చాలా సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆఖరుగా ఈయన నటించిన లైగర్ , ఖుషి , ది ఫ్యామిలీ స్టార్ మూవీలు వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. విజయ్ తాజాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

మూవీ లో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. అందులో ఈ మూవీ తెలుగు , తమిళ్ విడుదల తేదీల గురించి ప్రస్తావించారు కానీ హిందీ విడుదల గురించి ప్రస్తావించలేదు. దానితో ఈ సినిమాను హిందీలో థియేటర్లలో విడుదల చేయడం లేదు అని , నేరుగా ఓ టీ టీ లో విడుదల చేయబోతున్నారు అని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... కింగ్డమ్ సినిమాను హిందీ లో కూడా విడుదల చేయబోతున్నాం. కానీ అక్కడ టైటిల్ ఇష్యూ వల్ల హిందీ విడుదల గురించి ప్రస్తావించలేదు. కొత్త టైటిల్ తో కింగ్డమ్ హిందీ వర్షన్ అప్డేట్ కూడా ఇస్తామని నాగ వంశీ చెప్పుకొచ్చాడు. దీనితో విజయ్ అభిమానులు ఖుషి అవుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd