
దీంతో విజయ్ దేవరకొండ సినిమాను హిందీలో "సామ్రాజ్య" అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. మిగిలిన భాషల్లో మాత్రం "కింగ్‌డమ్" అనే పేరుతోనే రిలీజ్ జరుగుతుంది. టైటిల్ మారినప్పటికీ, కంటెంట్ విషయంలో ఎలాంటిఇబ్బంది లేదు. సినిమా యూనివర్సల్ పాయింట్‌తో, అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించినట్టు దర్శకుడు గౌతమ్ తెలిపారు. విజయ్ దేవరకొండ “లైగర్” తర్వాత హిందీలో విడుదలవుతున్న తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే. "లైగర్" అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ , ఈసారి పూర్తిగా స్క్రిప్ట్‌పై, డైరెక్షన్ పై ఫోకస్ పెట్టారని సమాచారం. సినిమాకు సంబంధించి హిందీలో డబ్బింగ్ పనులు ఎంతో ప్రత్యేకంగా తీసుకున్నారని సమాచారం. హిందీ నేటివ్ టోన్ , డైలాగ్ డెలివరీ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.
నార్త్ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకు మంచి థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఇప్పటికే హైప్ పీక్స్‌లో ఉంది. టైటిల్ మారినా కూడా ప్రేక్షకులలో ఎలాంటి నెగటివ్ ప్రభావం ఉండకపోవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. ఒక సామ్రాజ్య నిర్మాణం, రాజకీయ కుట్రలు, హీరో స్ట్రగుల్స్ - ఇవన్నీ మిక్స్ అయిన పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిందని సమాచారం.సినిమా జూలై 31న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. మ్యూజిక్, ట్రైలర్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్నప్పటికీ, టైటిల్ మార్పు వార్త ఇప్పుడు మరింత చర్చకు దారి తీస్తోంది. కానీ, “కింగ్‌డమ్” గానీ “సామ్రాజ్య” గానీ, కథ అందరినీ ఆకట్టుకుంటే టైటిల్ పెద్ద విషయం కాదని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.