
ఇటీవల విడుదలైన చిత్రం జూనియర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కిరీటి రెడ్డి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా, రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో కిరీటి సినీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తన డెబ్యూనే ఒక సాలిడ్ హిట్‌గా మలచుకున్నాడు. కంటెంట్ యావరేజ్ అయినా కిరీటి తన ఎనర్జీ, డాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా జూనియర్‌కు యూత్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. విడుదలకు ముందు ఓ రేంజ్‌లో ప్రమోషన్లు నిర్వహించిన ఈ సినిమా యూనిట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచటంలో విజయం సాధించింది. దీంతో సినిమాకి థియేటర్లలో మంచి క్రౌడ్ వస్తోంది. జూనియర్ విడుదలైన మూడు రోజుల్లోనే ఊహించని రీతిలో ర్యాంపేజ్ చూపించింది. మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రు. 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కంటే రెండో రోజు మరింత వసూళ్లు నమోదు చేసింది.
మూడు రోజులు గడిచినా ఇంకా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుక్ మై షో వంటి ఆన్లైన్ టికెట్ ప్లాట్‌ఫామ్‌లలో డే 3 బుకింగ్స్ డే 2 కంటే బెటర్‌గా ఉండటం విశేషం. ఇది యంగ్ హీరో కిరీటి రెడ్డికి ఒక బిగ్ ప్లస్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఫాలోయింగ్ డెబ్యూ సినిమాతో రావడం అరుదైన విషయం. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాటలు యూత్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే సాయి కొర్రపాటి నిర్మించిన జూనియర్ సినిమాను వారాహి చలన చిత్రం అత్యున్నత ప్రమాణాలతో నిర్మించింది. సినిమాలో కిరీటి యాక్షన్ సీన్లు, డాన్సింగ్ స్కిల్స్, ఎమోషనల్ సీన్లలోనూ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. శ్రీలీల గ్లామర్, ఎనర్జీ కథకు కలుసుకుని సినిమాకు మరింత బలం ఇచ్చాయి. ఫ్యామిలీ ఆడియెన్స్, యూత్ ఇద్దరికీ ఏకకాలంలో కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉన్నదంటే అతిశయోక్తి కాదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు