పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు.. డైరెక్టర్ జ్యోతి కృష్ణ, అలాగే క్రిష్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రానికి నిర్మాతగా ఏ.ఎం .రత్నం నిర్మించారు. ఈనెల 24వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ రోజున మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించగా.. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.


పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏ.ఎం రత్నం ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చాలా మౌనంగానే ఉంటారు. ఆ మౌనమే ఈరోజు తనని రోడ్డుమీదికి తీసుకువచ్చేలా చేసిందంటూ తెలిపారు. ఆయన ఒక మంచి సినిమా తీశారని చెప్పడానికే తాను ఈ వేదిక మీదికి వచ్చానంటు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అందుకే ap FDC చైర్మన్గా ఏ.ఎం.రత్నం పేరుని తీసుకువచ్చానని తెలిపారు పవన్ కళ్యాణ్. సినిమా పరిశ్రమ తనకు అన్నం పెట్టిందని పొలిటికల్ గా కూడా తనకి ఎంత పేరు ఉన్నప్పటికీ ఇతర హీరోలతో తనని పోల్చుకుంటే బిజినెస్ కూడా అంతగా ఉండకపోవచ్చు అని వెల్లడించారు.


అందుకు గల కారణం తన దృష్టి అంతా కూడా ఎక్కువగా పొలిటికల్ వైపే ఉండడం.. చాలామంది హీరోలలో తాను కూడా ఒకరినని అంతేకానీ సపరేట్గా ఏమి ఉండదని తెలిపారు. సంవత్సరంలో తనది కూడా ఒక్క సినిమా మాత్రమే ఉంటుంది. మనమందరము కూడా మనుషులమే, కులం ,మతం, ప్రాంతం, భాష పేరుతో కొట్టుకుంటున్నామంటూ తెలిపారు. కానీ సినిమాకు ఇలాంటి వివక్షత ఏవి ఉండవని వెల్లడించారు. చిరంజీవి కొడుకు అయినా సరే, తమ్ముడైన, మరెవరైనా సరే మనకు సత్తా లేకుంటే ఇండస్ట్రీలో ఉండలేమని తెలిపారు. ఇండస్ట్రీలోకి కొత్త వాళ్లు కూడా రావాలని వారందరి కోసం ఏ.ఎం రత్నం లాంటి నిర్మాతలు ఉండాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: