
మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ కొంతమంది హీరోయిన్స్ కాళ్ళు పట్టుకునేలా హీరోల చేత కొన్ని సీన్స్ చేయిస్తున్నారు. "అనిమల్" సినిమాలో రన్బీర్ కపూర్ - రష్మిక మందన్నా కాళ్లు పట్టుకున్న సీన్ ఎంత ట్రోలింగ్ కి గురైందో అందరికీ తెలిసిందే . ఆ టైంలో బాలీవుడ్ జనాలు మొత్తం కూడా రష్మిక మందన్నా పై పీకల్లోతు కోపంగా ఉండిపోయారు . రష్మిక మందన్నా కాళ్లు పట్టుకోవడం ఏంటి రణబీర్ కపూర్..?? అంటూ చాలా దారుణంగా మాట్లాడారు. అసలు డైరెక్టర్ ఎందుకు ఇలాంటి సీన్ రాశాడు అంటూ కూడా మండిపడ్డారు . కేవలం సందీప్ రెడ్డి వంగ మాత్రమే కాదు చాలామంది డైరెక్టర్ లు సినిమాలలో హీరోయిన్ కాళ్లు పట్టుకునేలా హీరోలు కొన్ని సీన్స్ రాసేవారు. పుష్ప 2 సినిమాలో "పీలింగ్స్ సాంగ్" లో రష్మిక మందన్నా కాళ్ళు ఎన్నిసార్లు అల్లు అర్జున్ పట్టుకుంటాడు అనేది అందరం చూసినదే .
అయితే ఒక స్టార్ హీరో ఇలా హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం అనేది ఫ్యాన్స్ కి హర్టింగ్ విషయం . చాలామంది ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ట్రోల్ చేసేవారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ ఇలాంటి సీన్స్ లో మేము నటించలేము అంటూ తెగేసి చెప్పేస్తున్నారట. డైరెక్టర్ చెప్పిన సీన్స్ యధావిధిగా చేస్తూ ఉంటే స్టార్ హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు అని.. సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలను బయటపెట్టి మరి బాధపెడుతున్నారు అని ..ఇకపై స్టార్ హీరోల ఫ్యాన్స్ ను హర్ట్ చేసే విధంగా ఏ విధమైనటువంటి సీన్స్ లో నటించకూడదు అంటూ డిసైడ్ అయిపోయారట .
ఇదే విషయాన్ని ఓపెన్ గానే మేకర్స్ కి చెప్పేస్తున్నారట . స్టార్ హీరోలు తమ కాళ్లు పట్టుకునే విధంగా ఉండే సీన్స్ అస్సలు చేయము అని ..హద్దులు మీరిన సీన్స్ అంతకంటే చేయము అంటూ ఓపెన్ గానే డైరెక్టర్స్ కి సినిమాకి కమిట్ అయ్యే ముందే చెప్పేస్తున్నారట . ఇది ఒక అందుకు మంచి విషయం అంటున్నారు సినీ ప్రముఖులు. అలాంటి సీన్స్ చేయడం వల్ల హీరోలు ఏమీ ఇబ్బంది పడరు.. హీరోయిన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కి గురీవ్వాల్సి వస్తుంది. కొంతమంది హీరోయిన్స్ ఇలా మేము ఆ సీన్స్ చేయలేము అని చెప్పడం చాలా చాలా మంచి పని అంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు..!!