పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ బిగినింగ్ నుండి అనేక రీమిక్ సినిమాలలో నటించాడు. పవన్ కెరియర్ బిగినింగ్ లో నటించిన అనేక రీమేక్ సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ మధ్య కాలంలో కూడా పవన్ వరుస పెట్టి రీమిక్ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్నాడు. పవన్ ఆఖరుగా నటించిన మూడు సినిమాలు అయినటువంటి వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ , బ్రో ఈ మూడు సినిమాలు కూడా రీమేక్ మూవీలే కావడం విశేషం. పవన్ నటించిన సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వస్తున్న అవి భారీ స్థాయి రికార్డులను నెలకొల్పడం లేదు.

దానితో అనేక మంది పవన్ వరుస పెట్టి రీమిక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలకు ప్రేక్షకాదరణ  పెద్దగా దక్కడం లేదు. ఏదైనా ఒక భాషలో మంచి విజయం సాధించిన సినిమా వెంటనే ఓ టీ టీ లోకి వచ్చేస్తుంది. దానితో అనేక మంది ప్రేక్షకులు ఆ సినిమాలను వీక్షిస్తున్నారు. దానితో రీమిక్ సినిమాలు పెద్దగా ప్రేక్షకు ఆదరణ పొందడం లేదు. అందుకే పవన్ సినిమాలకు మంచి టాక్ వచ్చిన , భారీ కలెక్షన్లు వచ్చిన కొత్త కొత్త రికార్డులను సృష్టించలేక పోతున్నాయి అని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ చాలా కాలం తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీ రీమిక్ సినిమా కాదు. దానితో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు.

సినిమా తర్వాత పవన్ నుండి ఓజి అనే మూవీ రాబోతుంది. ఇది కూడా రీమిక్ సినిమా కాదు. దానితో ఈ మూవీపై కూడా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత పవన్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రానుంది. హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తేరి అనే మూవీ కి రిమేక్ గా రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానితో పవన్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: