ఫ‌హ‌ద్ ఫాసిల్‌.. మల‌యాళ న‌టుడే అయిన `పుష్ప‌`తో ఇటు సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లోనూ భారీ స్టార్డ‌మ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో స్టన్నింగ్‌ పర్‌ఫార్మెన్స్‌తో ఫ‌హ‌ద్ చెల‌రేగిపోయాడు. అలాగే గ‌త ఏడాది `ఆవేశం` సినిమాలో సోలో హీరోగా, ర‌జినీకాంత్ యొక్క `వేట్టయన్` మూవీలో కీలక పాత్ర పోషించి మ‌రో రెండు సూప‌ర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ.. యాక్టింగ్‌లో వేరియేషన్స్‌ చూపిస్తూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచ‌డంలో ఎప్పుడూ ముందుండే ఫ‌హ‌ద్‌.. ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు.


అలాగే నేడు `మారేసన్` అనే మూవీతో ప‌ల‌క‌రించాడు. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఫ‌హ‌ద్ ఫాసిల్ ఓ నేష‌న‌ల్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నటుడిగా రిటైర్మెంట్ తీసుకున్నాక ఏం కావాల‌ని అనుకుంటున్నానో వివ‌రించారు. ఫ‌హ‌ద్ ఫాసిల్ మాట్లాడుతూ.. `రీసెంట్ గా స్పెయిన్ లోని బార్సిలోనాకి వెళ్ళాను. ఆ సిటీ నాకెంత‌గానో నచ్చింది. నేను న‌టుడిగా రిటైర్ అయ్యాక అక్కడ క్యాబ్ డ్రైవర్ గా వ‌ర్క్ చేయాలి అనుకుంటున్నాను. బార్సిలోనాకు వెళ్లి స్పెయిన్ అంతటా ప్రజలను తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.


ఒక మనిషిని తన గమ్యానికి చేర్చడంలో చాలా మంచి అనుభూతి ఉంది. అలాగే డ్రైవింగ్ అంటే మ‌క్కువ ఉన్నవారికి అది ప్రశాంతతను కూడా ఇస్తుంది` అంటూ వింత‌ కోరికను బ‌య‌ట‌పెట్టి అంద‌రి మ‌తులుపోగొట్టారు. స్టార్ యాక్ట‌ర్ అయ్యుండి రిటైర్మెంట్ త‌ర్వాత త‌న‌కు క్యాబ్ డ్రైవ‌ర్ అవ్వాల‌నుంద‌ని చెప్ప‌డం నిజంగా విడ్డూర‌మే. మ‌రి ఆయ‌న కోరిక నెర‌వేరుతుందా? అందుకు ఆయ‌న వైఫ్ నజ్రియా నజీమ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: