మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న విశ్వంభర వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫాంటసీ యాక్షన్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యం కావడంతో సినిమా విడుదల వాయిదా పడింది. మొదట 2025 జనవరి 10న సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు, కానీ ఇప్పుడు కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన లేదు. అయితే, అక్టోబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది, ఒక్క పాట మినహా. ఆ పాట షూటింగ్ నేడు ప్రారంభమైంది. దర్శకుడు వశిష్ఠ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా కథ గురించి వివరించారు, ఇది 14 లోకాల నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా 80 శాతానికి పైగా పూర్తయిందని ఆయన చెప్పారు.

ఈ పాటలో మౌనీ  రాయ్ చిరంజీవికి జోడీగా నటించారు. ఈ సాంగ్ ఫోక్ సాంగ్ కాగా ఎన్నో ప్రత్యేకతలతో ఈ సాంగ్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. గణేష్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారని తెలుస్తోంది. ఏఎస్ ప్రకాష్  నిర్మించిన భారీ సెట్ లో  ఈ సాంగ్ షూటింగ్  పూర్తయింది. ఈ సాంగ్ షూట్ తో సినిమా దాదాపుగా పూర్తైనట్టేనని చెప్పవచు.

అయితే గ్రాఫిక్స్ పనులన్నీ పూర్తయ్యే వరకు  ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే  లేదు. విశ్వంభర టీజర్ గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పొరపాట్లు రిపీట్  కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు









మరింత సమాచారం తెలుసుకోండి: