
ప్రత్యేకంగా డిజైన్ చేయించిన షాండ్లియర్స్, కస్టమ్ మేడ్ బెడ్రూం సెటప్, మోడర్న్ కిచెన్ & లివింగ్ స్పేస్… అన్నీ తారక్ అభిరుచి స్థాయిని చూపిస్తున్నాయి. ఇంటీరియర్ డిజైన్‌లో ఫంక్షనాలిటీకి తోడు ఫ్యామిలీ బాండింగ్‌కి ప్రాధాన్యతనిచ్చారు. ఇది చూడగానే “ఇది ఓ ఇంటికంటే ఎక్కువ... ఫీల్‌కి హోమ్” అనిపించేస్తుంది. కొత్త ఇంట్లోకి తారక్ ఫ్యామిలీ ఇటీవలే గ్రాండ్‌గా షిఫ్ట్ అయ్యింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు ఈ హ్యాపీ మోమెంట్‌ను సెలబ్రేట్ చేశారు. పలు సెలెబ్రిటీల బెస్ట్ విషెస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఇంటి ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ లైఫ్‌స్టైల్ అంటే ఇదే! అనేలా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక సినిమాల పరంగా చెప్పాలంటే, ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన వార్ 2 వచ్చే నెల ఆగస్టులో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ 2026 జూన్‌కి లాక్ అయ్యింది. ఇక కొరటాల శివతో దేవర 2, త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ లాంటి టాప్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో హ్యాపీ, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ – ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి జోష్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లోని తాజా మార్పులు చూస్తేనే తెలుస్తోంది… యంగ్ టైగర్ ఫోకస్ ఇప్పుడు ఫ్యామిలీ, ఫ్యూచర్‌పై!

