టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన నెలలలో జులై నెల కూడా ఒకటనే సంగతి తెలిసిందే. జులై నెలలో విడుదలైన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఏడాది జులై నెల మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఆశించిన స్థాయిలో కలిసిరాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జులై నెలలో విడుదలైన సినిమాలలో కింగ్డమ్ మినహా మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.

జులై మొదటి వారంలో తమ్ముడు సినిమా ఒకింత భారీ అంచనాలతో విడుదల కాగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది. లయ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పును పొందే విషయంలో ఫెయిల్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అదే వారం  విడుదలైన  షో టైమ్,  3 BHK  సినిమాలు సైతం ఫ్లాప్ అయ్యాయి.

ఓటీటీలో విడుదలైన ఉప్పు కప్పురంబు సినిమా కూడా ప్రేక్షకుల మెప్పు పొందలేదు.  జులై నెల రెండో వారంలో విడుదలైన  ఓ భామ అయ్యో రామ, విర్జిన్ బాయ్స్, దీర్గాయుష్మాన్ భవ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.  జులై నెల మూడో వారంలో  కొత్తపల్లిలో ఒకప్పుడు, మై బేబీ, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు విడుదలయ్యాయి.

ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి.  అదే వారం విడుదలైన జూనియర్ సినిమా సైతం ఫస్ట్  వీకెండ్ భారీస్థాయిలో కలెక్షన్లను సాధించినా ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది.  హరిహర వీరమల్లు సినిమా అత్యంత భారీ అంచనాలతో విడుదలై నిరాశపరిచింది. నిన్న విడుదలైన కింగ్డమ్ సినిమా మాత్రమే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది జులై నెల ఇండస్ట్రీకి భారీ షాకులిచ్చిందని చెప్పడంలో ఏ  మాత్రం సందేహం అవసరం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: