జులై నెలలో విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ కాగా కింగ్ డమ్ మాత్రం ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ మలయాళంలో సైతం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పారు. ఓవర్సీస్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ఆంధ్రలో మూడు నాలుగు జిల్లాల్లో మాత్రం జీఎస్టీ వెనక్కు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

ఇన్ స్టా లో, యూ ట్యూబ్ లో ఇన్ కమ్ కోసం, వ్యూస్ కోసం సినిమాలను చంపేస్తున్నారని ఆయన వెల్లడించారు. స్మార్ట్ ఫోన్ వుంటే చాలు రివ్యూ చెప్పేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సినిమా రివ్యూ అని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.  కింగ్ డమ్ ఫస్ట్ హాఫ్ సూపర్ అని సెకండ్ హాఫ్ లో కొన్ని తప్పులు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు  వ్యక్తమవుతున్నాయి.

కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా అదరగొడుతోంది.  విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ సాధించినా అర్జున్ రెడ్డి, గీతా గోవిందం స్థాయి హిట్ మాత్రం సాధించలేదని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  కింగ్ డమ్  సినిమా విషయంలో గౌతమ్ తిన్ననూరి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని  అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.  కింగ్ డమ్  సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

కింగ్డమ్ సినిమా సక్సెస్ మాత్రం విజయ్ దేవరకొండ కెరీర్ కు ఎంతగానో ప్లస్ అవుతుంది.  విజయ్ దేవరకొండ భవిష్యత్తు సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే  సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ  నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను  ఎంచుకుని రికార్డులను క్రియేట్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మలయాళంలో కింగ్ డమ్  సినిమా ఏకంగా 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: